E-Paper
Advertisement

బతికుండగానే నరకయాతన… చావాలనుకునే వాళ్ళనే టార్గెట్ చేసి చంపే కిల్లర్

బతికుండగానే నరకయాతన… చావాలనుకునే వాళ్ళనే టార్గెట్ చేసి చంపే కిల్లర్
Advertisement

Psychological Thriller: తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు చావాలనే ఆలోచన వస్తుంది. కానీ ఆ చావును మించిన నరకం బతికి ఉండగానే అనుభవించాల్సి వస్తే… సూసైడ్ చేసుకునేంత వేదనను మించిన టార్చర్ మన కోసం ఎదురు చూస్తుంటే ఎలా ఉంటుంది ? అది తెలియాలంటే తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్న 2024 అమెరికన్ సర్వైవల్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ మూవ్’ (Don’t Move)ను చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కేవలం 20 నిమిషాల సమయంలో ఒక స్త్రీ జీవితం ఎలా పూర్తిగా మారిపోతుందో చూపించే ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్. క్షణం క్షణం భయం పెరుగుతూ, శరీరం స్తంభించిపోతున్నప్పటికీ మనసు మాత్రం పోరాటం కొనసాగించడం ఈ చిత్రంలో హైలైట్ గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్తే… హీరోయిన్ పేరు ఐరిస్ (కెల్సీ ఆస్బిల్). ఆమె కుమారుడి మరణంతో తీవ్రంగా డిప్రెషన్‌లో ఉంటుంది. ఆ బాధను తట్టుకోలేక, తన కొడుకును పూడ్చి పెట్టిన కొండ ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

Advertisement

చివరి క్షణాల్లో అక్కడకు ఒక మిస్టీరియస్ వ్యక్తి వస్తాడు. ఇక్కడే కథలో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు రిచర్డ్. అతను చాలా సానుభూతిగా మాట్లాడి, ఐరిస్ మనసు మార్చి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడతాడు. దీంతో అతనితో పాటే ఆ కొండ దిగొస్తుంది హీరోయిన్. కానీ ఆ తర్వాత అతని నిజస్వరూపం బయట పడుతుంది. అతను ఒక క్రూరమైన సైకో కిల్లర్. ఐరిస్‌పై అకస్మాత్తుగా దాడి చేసి, స్పృహ తప్పేలా చేసి తన కారులోకి ఎక్కిస్తాడు.

ఐరిస్ కళ్లు తెరిచేసరికి తన శరీరం క్రమంగా స్తంభించిపోతున్నట్లు తెలుస్తుంది. రిచర్డ్ ఆమెకు ఒక ప్రత్యేక పారాలిటిక్ ఏజెంట్ ఇంజెక్ట్ చేశానని చెప్తాడు. ఆ మందు సరిగ్గా 20 నిమిషాల్లో శరీరాన్ని పూర్తిగా స్తంభింపజేస్తుంది. నిమిషం నిమిషానికి ఆమె శరీరం ఎలా మారుతుందో రిచర్డ్ వివరిస్తాడు. కాళ్లు మొద్దుబారడం, శ్వాస కష్టం, చేతులు కదలకపోవడం… చివరికి కేవలం కళ్లు మాత్రమే కదలగలిగే స్థితికి చేరుకుంటారు. ఇదంతా తెలుసుకుని షాక్ అయిన ఐరిస్ సమయం వృధా చేయకుండా కారు నుండి తప్పించుకుని అడవిలోకి పారిపోతుంది.

Advertisement

నిమిషం నిమిషానికి ఆమె శరీరం సహకరించడం మానేస్తుంటుంది. ఒకవైపు రిచర్డ్ ఆమెను వేటాడుతూ ఉంటాడు. ఆమె ఒక నదిలో పడిపోయినప్పుడు బిల్ అనే వృద్ధుడు ఆమెను కాపాడి తన ఇంటికి తీసుకెళ్తాడు. కానీ రిచర్డ్ అక్కడికి కూడా చేరుకుని బిల్‌ను చంపేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రిచర్డ్‌కు ఎదురవుతాడు. కానీ ఆ సైకో కత్తికి పోలీస్ కూడా బలి అవుతాడు. చివరి దశలో ఐరిస్ శరీరంలో పక్షవాతం ప్రభావం కొంత తగ్గుతుంది. మరి ఆ సైకో కిల్లర్ నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంటుంది ? చివరికి ఆమె ప్రాణాలతో బయట పడిందా లేదా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

డోంట్ మూవ్ 1 గంట 32 నిమిషాల చిన్న సినిమానే. కానీ ప్రతి నిమిషం ఉత్కంఠ, టెన్షన్‌తో నిండి ఉంటుంది. కెల్సీ ఆస్బిల్ ఒంటరి పోరాటంలో అద్భుతంగా ఉంటుంది. ఫిన్ విట్‌రాక్ సైకో కిల్లర్‌ రోల్ లో జీవించాడని చెప్పాలి. సామ్ రైమి నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి బ్రియాన్ నెట్టో, స్టీఫెన్ స్క్యాంప్‌లెక్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా Netflixలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.

Read Also: కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం… ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Related News

దేవుడిచ్చిన మ్యాజికల్ బుక్‌తో మిడిల్ క్లాస్ మ్యాన్ రచ్చ… తెలుగు మూవీనే

ఓటీటీలో ఈ వారం ఎక్కువ మంది చూసిన టాప్ 10 ఇవే… రష్మిక మూవీని వెనక్కి నెట్టేసిన రియాలిటీ షో

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

రూ. 1185 కోట్ల కలెక్షన్స్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న రాబిన్ హుడ్ చివరి కథ

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

Big Stories

Advertisement
×