BigTV English

OTT Movie : రాత్రి అయితే చాలు రక్తం తాగాల్సిందే… మతి పోయే ట్విస్టులు… ఎక్కడికో తీసుకెళ్లే స్టోరీ

OTT Movie :  రాత్రి అయితే చాలు రక్తం తాగాల్సిందే… మతి పోయే ట్విస్టులు… ఎక్కడికో తీసుకెళ్లే స్టోరీ

OTT Movie : భారతదేశం ఎన్నో భాషలకు నిలయం. ప్రతి భాషలో ఒకప్పుడు నాటకాలు వేసే వారు. ఇప్పుడు ఆ స్థానంలో సినిమాలు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా, థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబో యే బెంగాలీ మూవీలో ట్విస్టులు మామూలుగా ఉండవు. 1971 లో ఒక స్టోరీ, ప్రజెంట్ లో ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు చివరివరకు టెన్షన్ తో పిచ్చెక్కిపోతారు. ఈ మూవీ ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి వదిలారు. బాక్సాఫీస్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


హాట్ స్టార్ (Hotstar) లో

ఈ బెంగాలీ మూవీ పేరు ‘డ్రాక్యులా సర్’  (Dracula Sir). 2020 లో వచ్చిన ఈ బెంగాలీ నియో నోయిర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి దేబాలోయ్ భట్టాచార్య దర్శకత్వం వహించారు. నాన్-లీనియర్ స్ట్రక్చర్డ్ ఫిల్మ్, SVF బ్యానర్‌పై శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోనీ ఈ మూవీని నిర్మించారు. ఇందులో అనిర్బన్ భట్టాచార్య, మిమీ చక్రవర్తి, బిదీప్త చక్రవర్తి, రుద్రనీల్ ఘోష్, సమీయుల్ ఆలం, కంచన్ ముల్లిక్, సుప్రియో దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. “డ్రాక్యులా సర్” అని పిలవబడే ఒక పాఠశాల ఉపాధ్యాయుని చుట్టూ కథ తిరుగుతుంది. గత జన్మలో నక్సలైట్ అయిన స్కూల్ టీచర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

రక్తీమ్ ఒక అద్దె ఇంట్లో ఉంటూ స్కూల్ టీచర్ గా పని చేస్తుంటాడు. ఆ ఇంటి ఓనర్ కొడుకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అతని ఏడుపు మాన్పించాలని ఇంటి ఓనర్ రక్తీమ్ ను పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని పండ్లు డ్రాకులాకు ఉన్నట్టు ఉంటాయి. రక్తీమ్ భయపెడితేనే ఆ పిల్లోడు ఏడుపు మానుతాడు. స్కూల్లో కూడా రక్తీమ్ ను డ్రాకులా సార్ అని పిలుస్తూ ఉంటారు. సెల్ ఫోన్ లో ఒకసారి రక్తం చూసి అతనికి ఒకలా అనిపిస్తుంది. ఒకరోజు ఒక షూటింగ్ కోసం డైరెక్టర్ రక్తీమ్ ను డ్రాకులా వేశం వేయమని చెప్తాడు. స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఒత్తిడి చేయడంతో ఆ పాత్రను వేయడానికి ఒప్పుకుంటాడు. అయితే హీరోయిన్ మెడ కొరికే సీన్ వస్తుంది. తనకు తానే తెలియకుండా ఆమెను గట్టిగా కొరికి పారిపోతాడు. ఇంటికి వచ్చాక ఓనర్ ని కూడా గట్టిగా కొరుకుతాడు. ఆ తర్వాత ఇతనికి ఉద్యోగం కూడా పోతుంది. సూసైడ్ చేసుకోవాలని ట్రైన్ దగ్గరికి వెళ్తాడు. ట్రైన్ కి ఎదురు వెళ్లే సాహసం చేయకపోవడంతో, ఈసారి చెరువులోకి దూకి చనిపోవాలనుకుంటాడు.

అక్కడికి 1971లో ఉండే మంజరి అనే అమ్మాయి వస్తుంది. నీ అవసరం మాకు ఉంది అంటూ మాట్లాడుతుంది. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మర్చిపోతాడు. ఇక్కడే ఊహకందని ట్విస్ట్ వస్తుంది. మంజరి, అమూల్ 1971లో నక్సలైట్లుగా ఉంటారు. పోలీసులు మంజరిని హింసించి, అమూల్ ని ఎన్కౌంటర్ చేస్తారు. ఆ స్టోరీని తన స్టోరీగా ఊహించుకుంటూ ఉంటాడు రక్తీమ్ . చివరికి ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. డాక్టర్లు అదంతా నీ భ్రమ అంటూ అతనికి కౌన్సిలింగ్ ఇస్తారు. అయితే అతడు అవన్నీ వాస్తవాలే అనుకుంటూ ఉంటాడు. చివరికి హీరో ఇదంతా ఊహించుకున్నాడా? నిజంగానే జరిగిందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘డ్రాక్యులా సర్’  (Dracula Sir) అనే ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×