BigTV English

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : కొంచెం ఇష్టం, కొంచం కష్టం గా చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే, అవి హారర్ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలలో భయపెట్టే సీన్స్ ఉండటమే ఇందుకు కారణం. అలాంటి వణుకు పుట్టించే సినిమా ఓటీటీలో అందుబాటులోనే ఉంది. ఈ సినిమా ఒక బ్యాంక్ లోన్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక వృద్ధ మహిళ పెట్టే శాపం వల్ల ఆమె ఆత్మతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ చిత్రం 2010లో సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ హారర్ ఫిల్మ్, ఉత్తమ నటి నామినేషన్లు పొందింది. అలాగే MTV మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ హారర్ సినిమాగా నామినేట్ అయింది.దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలలోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

క్రిస్టీన్ బ్రౌన్ ఒక బ్యాంక్ లోన్ ఆఫీసర్. ప్రమోషన్ కోసం, తన బాస్ మిస్టర్ జాక్స్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమె తన ప్రియుడు క్లే డాల్టన్ అనే ఒక కాలేజ్ ప్రొఫెసర్ తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఒక రోజు సిల్వియా అనే వృద్ధ మహిళ తన ఇంటి మీద లోన్ పొడిగింపు కోసం వేడుకుంటుంది. కానీ క్రిస్టీన్ తన ప్రమోషన్ అవకాశాలను పెంచుకోవడానికి, ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తుంది. కోపంతో ఉన్న సిల్వియా, క్రిస్టీన్‌పై ఒక సాతాను ఆత్మను ఆవహించేలా చేస్తుంది. ఇది మూడు రోజుల పాటు ఆమెను వేధిస్తుంది. అంతేకాకుండా క్రిస్టీన్ ఆత్మను నరకానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. క్రిస్టీన్ ఈ సమయంలో భయంకరమైన దృశ్యాలు, దాడులతో వేధించబడుతుంది. ఈ ఆత్మ వల్ల ఆమె జీవితం అస్తవ్యస్తమవుతుంది.


ఆమె ఒక సైకాలజిస్ట్ రామ్ జస్ సహాయం కోరుతుంది. అతను ఈ శాపాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని చెప్తాడు. కానీ దానికి గొప్ప త్యాగం అవసరమని హెచ్చరిస్తాడు. ఇప్పుడు క్రిస్టీన్ ఈ శాపాన్ని తొలగించడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో సిల్వియా కూడా మరణిస్తుంది. కానీ ఈ శాపం క్రిస్టీన్ పై కొనసాగుతుంది. ఈ శాపం సమయంలో సిల్వియా క్రిస్టీన్ కు ఒక వస్తువు బహుమతిగా ఇచ్చి ఉంటుంది. ఈ వస్తువు ద్వారా శాపాన్ని ఎవరికైనా బదిలీ చేయవచ్చని తెలుసుకుంటుంది. ఆమె మొదట తన సహోద్యోగి స్టూ కు ఈ వస్తువు ఇవ్వాలని అనుకుంటుంది. కానీ ఇవ్వలేకపోతుంది.

ఇక ఆమె సిల్వియాకు ఈ వస్తువు ఇవ్వడానికి నిర్ణయించుకుంటుంది. ఆమె శవాన్ని స్మశానంలో తవ్వి, ఆ వస్తువును నోటిలో పెడుతుంది. శాపం తొలగినట్లు భావిస్తుంది. అయితే క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఇది స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. సిల్వియా దగ్గర ఉన్న వస్తువు ఎలాంటిది ? దానివల్ల ఆత్మలు ఎలా ట్రావెల్ చేస్తాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? క్రిస్టీన్ శాపం నుంచి బయటపడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

“డ్రాగ్ మీ టు హెల్” (Drag Me to Hell) అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. సామ్ రైమీ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో అలిసన్ లోహ్మన్, జస్టిన్ లాంగ్, లోర్నా రావర్, డిలీప్ రావు, డేవిడ్ పేమర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2009 మే 29న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలోదీనికి 6.6/10 రేటింగ్ అది.

Read Also : టీనేజ్ అమ్మాయిలే టార్గెట్… తేడా పనులు చేసే పాడు గ్యాంగ్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×