E-Paper
Advertisement

OTT Movie : పెళ్లై పిల్లలున్న మహిళ టీం లీడర్ తో… కొరియన్ మూవీ లవర్స్ కు పండగ ఈ సిరీస్

OTT Movie : పెళ్లై పిల్లలున్న మహిళ టీం లీడర్ తో… కొరియన్ మూవీ లవర్స్ కు పండగ ఈ సిరీస్
Advertisement

OTT Movie : కొరియన్ రొమాంటిక్ డ్రామాలను చూస్తూ ఆడియన్స్ ఎంచక్కా చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇవి చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. ఎక్కడా వల్గర్ లేకుండా ఫ్యామిలీలతో కలసి చూసే విధంగా ఇవి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త రొమాంటిక్ కామెడీ సిరీస్ ఆడియన్స్ ని అలరించడానికి వస్తోంది. ఈ కథ ఫేక్ ఐడెంటిటీతో ఉద్యోగం పొందే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇది ఆఫీస్ రొమాన్స్, హ్యూమర్, మిస్‌ కమ్యూనికేషన్‌లతో కూడిన ఒక ఫన్నీ స్టోరీ. తొందర్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న ఈ సిరీస్, కొరియెన్ రొమాంటిక్ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘డైనమైట్ కిస్’ (Dynamite kiss) 2025లో విడుదలయ్యే దక్షిణ కొరియా రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. దీనికి కిమ్ జే-హ్యున్ డైరెక్టర్ గా వ్యవహరించారు. . ప్రధాన పాత్రల్లో జాంగ్ కి-యాంగ్, అహ్న్ ఎఉన్-జిన్ నటించారు. ఇది SBS TVలో 2025 నవంబర్ 12 నుంచి ప్రీమియర్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అదే రోజు వరల్డ్‌వైడ్ అందుబాటులో ఉంటుంది. మొత్తం 14 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ 70 నిమిషాల నిడివితో నడుస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రిమ్ అనే ఒంటరి మహిళకు ఉద్యోగం అత్యవసరం అవుతుంది. ఉద్యోగం సంపాదించడానికి ఆమె ఒక బేబీ ప్రొడక్ట్స్ కంపెనీలో తాను వివాహితనని, తల్లిని అని అబద్ధం చెబుతుంది. ఈ చిన్న అబద్ధంతో ఆమెకు ఉద్యోగం వస్తుంది. ఇక ఆ ఉద్యోగంలో ఆమె మంచి పేరు కూడా తెచ్చుకుంటుంది. ఇలా సాగిపోతున్న తరుణంలో ఒక రోజు ఆమె తన టీమ్ లీడర్ గోంగ్ జి-హ్యోక్‌ను అనుకోకుండా ముద్దు పెట్టుకుంటుంది. జి-హ్యోక్ క్రమశిక్షణ, తెలివితేటలు కలిగిన వ్యక్తి. కానీ ఈ సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

Read Also : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

Advertisement

మొదట వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. వీళ్ళు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటారు. కబుర్లతో కాలక్షేపం కూడా చేస్తుంటారు. ఉన్నట్టుండి ఒక రోజు షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆమె ఫేక్ హస్బెండ్ సడన్‌గా కంపెనీలో ప్రత్యక్షం అవుతాడు. రిమ్ అబద్ధాలు చెప్పి ఈ ఉద్యోగం పొందినట్లు కూడా తెలిసిపోతుంది. దీంతో ఆఫీస్ వాతావరణం టెన్షల్ లో పడుతుంది. చివరికి ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తారా ? రిమ్, జి-హ్యోక్‌ లవ్ ట్రాక్ ఏమవుతుంది ? అనే విషయాలను, దక్షిణ కొరియా రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×