OTT Movie : దయ్యాల సినిమాలు ఇప్పుడు రకరకాల కథలతో భయపెట్టడానికి వస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు ఎక్కువగా భయపెట్టిస్తూ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ డిఫరెంట్ స్టోరీ తో వచ్చింది. ఇందులో ఎలివేటర్ గేమ్ ఒకటి ఉంటుంది. ఆ గేమ్ ఆడటం వల్ల ఒక రహస్యమైన ప్రాంతానికి వెళ్ళొచ్చని నమ్మకం ఉంటుంది. అలా ఒక సోదరి కనిపించకుండా పోవడంతో అన్న వెతకడానికి వెళ్తాడు. ఈ క్రమంలో స్టోరీ వణుకు పుట్టించే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎలివేటర్ గేమ్’ (Elevator Game). 2023 లో వచ్చిన ఈ సినిమాకి రిబెకా మెక్‌కెండ్రీ దర్శకత్వం వహించారు. ఇందులో గినో అననియా, మేగాన్ బెస్ట్, అలెక్ కార్లోస్, నజారీ డెమ్‌కోవిచ్, సమంతా హలాస్, మాడిసన్ మాక్‌ఇసాక్, వెరిటీ మార్క్స్ వంటి నటులు నటించారు. ఈ మూవీ ఆన్‌లైన్‌లో వైరల్ అయిన ఒక పురాణ కధ ఆధారంగా తీయబడింది. ఇందులో ఒక ఎలివేటర్‌లో నిర్దిష్ట క్రమంలో బటన్లు నొక్కడం ద్వారా మరో డైమెన్షన్‌కు వెళ్లవచ్చని నమ్ముతారు. ఈ క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ర్యాన్ అనే యువకుడు తన సోదరి బెక్కీ కనిపించకుండాపోవడంతో కంగారు పడతాడు. ఏమైందో తెలుసుకోవడానికి, కొంతమంది అతీంద్రియ శక్తుల గురించి పరిశోధన చేసే వారి సలహాలు తీసుకుంటాడు. బెక్కీ ‘ఎలివేటర్ గేమ్’ ఆడిన తర్వాత అదృశ్యమైందని అతను నమ్ముతాడు. ఈ గేమ్‌లో ఒక నిర్దిష్ట క్రమంలో ఎలివేటర్ ఫ్లోర్ బటన్లను నొక్కాలి, మరియు ఐదవ అంతస్తులో ‘ఫిఫ్త్ ఫ్లోర్ ఉమన్’ అనే అతీంద్రియ శక్తిని ఎదుర్కోవాలి. ఈ గేమ్ ఆడేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఆ స్త్రీతో మాట్లాడకూడదు. ర్యాన్ ఈ గ్రూప్‌ను ఒక స్థానిక భవనంలో గేమ్ ఆడమని ఒప్పిస్తాడు. అక్కడ బెక్కీ అదృశ్యమైందని అతను అనుమానిస్తాడు. ఇక వారు ఆ భవనంలో గేమ్ ఆడటం ప్రారంభిస్తారు. కానీ రికార్డింగ్ జరుగుతున్న వీడియో ఫుటేజ్ కోల్పోతారు. గ్రూప్‌లోని కొందరు గేమ్‌ను మళ్లీ ఆడటానికి నిరాకరిస్తారు.
కానీ ర్యాన్ తన సోదరి గురించి నిజాలు తెలుసుకోవడానికి ఒత్తిడి చేస్తాడు. ఈ క్రమంలో క్రిస్ అనే సభ్యుడికి, బెక్కీతో ఉన్న ఒక రహస్యమైన సంబంధం బయటపడుతుంది. ఆ తరువాత ఒక్కొక్కరుగా, ‘ఫిఫ్త్ ఫ్లోర్ ఉమన్’ చేతిలో చనిపోతారు. ఈ స్త్రీ ఒక ప్రతీకార ఆత్మ అని చ్లోయ్ అనే అమ్మాయి తెలుసుకుంటుంది. ఆమె ఒక ఎలివేటర్ లో చిక్కుకొని చనిపోయిఉంటుంది. ఇంతలోనే చ్లోయ్ కూడా చనిపోతుంది. అందరూ చనిపోవడంతో ర్యాన్ ఆత్మల ప్రపంచంలో చిక్కుకుంటాడు. చివరికి ర్యాన్ ఆ ఎలివేటర్ గేమ్ నుంచి బయట పడతాడా ? తన సోదరి ఆచూకీ కనిపెడతాడా ? ఈ విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : మొగుడు ఆఫీస్ కి వెళ్తే పెళ్ళాం పక్కింటోడితో … భర్త ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్