BigTV English
Advertisement

OTT Movie : మొగుడు ఆఫీస్ కి వెళ్తే పెళ్ళాం పక్కింటోడితో … భర్త ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : మొగుడు ఆఫీస్ కి వెళ్తే పెళ్ళాం పక్కింటోడితో … భర్త ఇచ్చే ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : బాలీవుడ్ సినిమాలకు ఎప్పటినుంచో మన ప్రేక్షకులు అభిమానులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కామిడీ కంటెంట్ తో వచ్చింది. ఇందులో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. భార్య వేరొకరితో ఉండటం చూసి తట్టుకోలేక బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది.  ఈ స్టోరీ చివరివరకూ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హిందీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లాక్‌మెయిల్’ (Black mail). 2018 లో విడుదలైన ఈ మూవీకి అభినయ్ దేవ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, కీర్తి కుల్హరి, అరుణోదయ్ సింగ్, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని T-సిరీస్ ఫిల్మ్స్, RDP మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అపూర్బా సేన్‌గుప్తా, రోహిత్ కదుదేశ్‌ముఖ్ నిర్మించారు. ఇందులో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు భర్త ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ 2018,ఏప్రిల్,6న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక మధ్యతరగతి ఉద్యోగి అయినటువంటి దేవ్ కౌశల్ బాత్రూమ్ ప్రొడక్ట్స్ సేల్స్ కంపెనీలో పనిచేస్తాడు. అతని జీవితం ఒకేలా సాగుతూ, భార్య రీనాతో సంతోషంగా గడుస్తుందని అనుకుంటాడు. కానీ ఒక రోజు, అతను ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చినప్పుడు, తన భార్య రీనా మరొక వ్యక్తి రణజీత్ తో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు కనిపెడతాడు. ఇది చూసి షాక్‌లో ఉన్న దేవ్, రణజీత్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయిస్తాడు. అతను రణజీత్‌ను బెదిరించి, డబ్బు డిమాండ్ చేసి తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అనుకున్నదే ప్లాన్ అమలు చేస్తాడు.  కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. రణజీత్‌కు కూడా తన సొంత వ్యాపారాలలో సమస్యలు ఉంటాయి. అతను దేవ్‌ను ఎదుర్కోవడానికి మరింత గందరగోళ పరిస్థితులను సృష్టిస్తాడు. ఈ బ్లాక్‌మెయిల్ ఆటలో మరికొంతమంది చిక్కుకుంటారు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కూడా ఇందులో భాగం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు బ్లాక్‌మెయిల్ చేస్తూ, తమ సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. చివరికి దేవ్ అనుకున్నది సాధిస్తాడా ? తన భార్యకి బుద్ధి వచ్చేలా చేస్తాడా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Read Also : రష్యన్ ప్రెసిడెంట్ కు ఇండియాలో మర్డర్ స్కెచ్ … అమ్మాయి వీడియోతో బ్లాక్ మెయిల్ … కిక్కెక్కించే స్పై థ్రిల్లర్

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×