BigTV English

Hit 3 Collections : నాని వేట.. కలెక్షన్ల మోత..ఐదు రోజులకు ఎన్ని కోట్లంటే..?

Hit 3 Collections : నాని వేట.. కలెక్షన్ల మోత..ఐదు రోజులకు ఎన్ని కోట్లంటే..?

Hit 3 Collections : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ హీరో నాని, మాస్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబీనేషన్ లో వచ్చిన మూవీ హిట్ 3.. గత ఏడాది వచ్చిన సరిపోదా శనివారం తర్వాత ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే దుమ్మురేపుతూ రూ.101 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్-ఈవెన్ మార్క్‌ను చేరుకుని, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.. నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది.  మరి ఐదు రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి చూసేద్దాం..


హిట్ 3 మూవీ..

గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా.. మోస్ట్ వైలెంట్ గా రూపొంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన శైలేష్ కొలను.. నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్‌కు ముందే ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. మేడే సందర్బంగా మే 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే జనాలు ఈ మూవీకి నీరాజనం పలుకుతున్నారు.. ఇదే జోరులో కొన్ని రోజులు కలెక్షన్స్ ను వసూల్ చేస్తే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది.


Also Read : రవితేజ పేరు మీద ఒక్క రూపాయి కూడా లేదా.. మొత్తం ఆమె పేరు మీదేనా..?

ఈ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. 

భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలోకి వచ్చేసిన హిట్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాని వేట మొదలు పెట్టాడు. ఫస్ట్ డే 43 కోట్లు వసూల్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసేసింది.. అదేవిధంగా రెండో రోజు కూడా వసూళ్ల సునామీ సృష్టించాడు నాని 20 కోట్ల వరకు వసూలు చేసి 63 కోట్లు రెండు రోజుల్లోనే రాబట్టాడు. ఇక మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు కాబట్టి 83 కోట్ల వరకు వసూలు చేశారు. ఇక నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా రాబట్టి నాని ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. అదే జోరులో సోమవారం కూడా కలెక్షన్స్ వసులయ్యాయి అని తెలుస్తుంది. మొత్తం 122 కోట్ల వరకు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హిట్ 3 అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ఓవర్సీస్‌లోనూ 2 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద నాని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండడంతో మూవీ టీంతో పాటు ఆయన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా నాని జోరుకు బ్రేకుల్లేవనే చెప్పాలి. గతడాది వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చినా మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా సినిమాకు సీక్వల్ గా ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమా కోసం నాని ఫాన్స్ తో పాటుగా యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×