BigTV English
Advertisement

OTT Movie : నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ కామెడీ మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ కామెడీ మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఒక తమిళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మిడిల్ క్లాస్ జీవన శైలిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.  ఇందులో సత్యరాజ్, కాళి వెంకట్  ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘మద్రాస్ మ్యాటినీ’ (Madras Matinee). 2025 లో విడుదలైన ఈ సినిమాకి కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. ఇందులో కాళి వెంకట్, సత్యరాజ్, రోషిణి హరిప్రియన్, షెల్లీ కిషోర్, జార్జ్ మరియన్, సునీల్ సుఖద, గీత కైలాసం ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ కింద నిర్మించారు. కె.సి. బాలసరంగన్ సంగీతం సమకూర్చగా, ఆనంద్ జి.కె. సినిమాటోగ్రఫీ, సతీష్ కుమార్ సముస్కి ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా 2025న జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. 2025 జూలై 4 నుండి సన్‌ ఎన్‌ఎక్స్‌టీ (SunNXT), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

‘మద్రాస్ మ్యాటినీ’ చెన్నై నగరంలోని మధ్యతరగతి జీవన శైలిని చూపించే, ఒక స్లైస్-ఆఫ్-లైఫ్ డ్రామాగా మొదలవుతుంది. జ్యోతి రామయ్య (సత్యరాజ్) అనే వృద్ధుడు, సైన్స్ ఫిక్షన్ కథలు రాస్తుంటాడు. అతను తన సూపర్‌హీరో స్క్రిప్ట్‌ను స్టీవెన్ స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో తెరకెక్కించాలని కలలు కంటాడు. అయితే అతన్ని ఒక వ్యక్తి మిడిల్ క్లాస్ మనుషుల గురించి స్టోరీ రాయమని సవాలు చేస్తాడు. దీంతో అతను కన్నన్ అనే వ్యక్తి స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు. కన్నన్ అనే ఒక ఆటో డ్రైవర్ కి, భార్య తో పాటు దీపిక, దినేష్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. కన్నన్ కుటుంబం మధ్యతరగతి జీవనంలోని ఆర్థిక ఇబ్బందులు పడుతుంటుంది. ఈ సమస్యలను దగ్గరనుంచి చూస్తున్న దీపిక ఒక ఐటీ ఉద్యోగం సంపాదించి, అమెరికాకు వెళ్లి కుటుంబ ఆర్థిక స్థితిని చక్కదిద్దాలని కలలు కంటుంది. కానీ కన్నన్ ఆమెను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. ఎందుకంటే పెళ్ళి ఆ సమయంలో ముఖ్యమైనదిగా భావిస్తాడు.

మరోవైపు దినేష్ ఏ బాధ లేకుండా ,స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయి ఉంటాడు. ఈ కుటుంబ రోజువారీ జీవనం, చిన్న చిన్న ఆనందాలు, నిరాశలతో నడుస్తుంటుంది.  ఇక ఈ కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దినేష్ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్, దీపిక కంటున్న కలలు, తండ్రి ఆర్థిక సమస్యలు ఒక ఎమోషన్ వైపు స్టోరీని నడిపిస్తాయి. ఈ సంఘటనలన్నీ జ్యోతి రామయ్య వివరిస్తూ ఉంటాడు. అతను తన స్వంత ఊహాశక్తిని వదిలిపెట్టి, నిజ జీవితంలోని హీరోయిజాన్ని అర్థం చేసుకుంటాడు. చివరికి జ్యోతి రామయ్య చెప్పే ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : భార్య ఉండగానే ప్రేయసితో… చిన్న క్లూ కూడా దొరక్కుండా మర్డర్… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా క్లైమాక్స్

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×