E-Paper
Advertisement

OTT Movie : టీనేజర్స్ పండుగ చేసుకునే సిరీస్… కాలేజ్ లో కిలాడి పనులు… డోంట్ మిస్

OTT Movie : టీనేజర్స్ పండుగ చేసుకునే సిరీస్… కాలేజ్ లో కిలాడి పనులు… డోంట్ మిస్
Advertisement

OTT Movie : హైస్కూల్ టీనేజర్ల ఈ తరం టాక్సిక్ రిలేషన్‌షిప్స్ తో ఒక సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది. డ్రగ్స్, అఫైర్స్, బోల్డ్ థీమ్స్ తో ఈ సిరీస్ ఓటీటీలో రచ్చ చేస్తోంది. ఈ సిరీస్ ని చాలా మంది పేరెంట్స్, టీచర్స్ బ్యాన్ చేయాలని కూడా క్యాంపెయిన్ చేశారు. యువత సమస్యలను కొన్నిసార్లు వివాదాస్పదంగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. అందువల్ల ఇది వివాదాల్లోకి లాగబడింది. సింగిల్ గా చూడాల్సిన ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ టీన్ డ్రామా సీరీస్ పేరు ‘యూఫోరియా’ (Euphoria). ఈ సిరీస్ ను సామ్ లెవిన్సన్ క్రియేట్ చేశాడు. ఇందులో జెండాయా (రూ), సిడ్నీ స్వీనీ (క్యాస్సీ), జేకబ్ ఎలోర్డి (నేట్), హంటర్ షాఫర్ (జూల్స్) అలెక్సా డెమీ (మ్యాడీ) లీడ్ రోల్స్ లో నటించారు. రెండు సీజన్లతో వచ్చిన ఈ సిరీస్ HBO Max, Jio Hotstarలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 9 ఎమ్మీ అవార్డులతో పాటు, 3 MTV అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ గెలిచింది. సీజన్ 3 కూడా 2026లో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

Read Also : ప్రియుడి కిరాతకం… ఆటో డ్రైవర్ అరాచకం… మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు

స్టోరీ ఏమిటంటే

రూ బెన్నెట్ అనే 17 ఏళ్ల అమ్మాయి డ్రగ్స్ కి బానిస అవుతుంది. డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడటానికి ఆమెను రీహాబ్‌ సెంటర్ కు పంపిస్తారు. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండకుండా, మళ్ళీ వాటితో సావాసం చేస్తుంది. తిరిగి తన హైస్కూల్ జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమెకు స్కూల్ లో జూల్స్ అనే కొత్తగా వచ్చిన ట్రాన్స్‌జెండర్ అమ్మాయి పరిచయం అవుతుంది. రూకి జూల్స్‌తో ఏర్పడిన స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది, ఇది ఆమెకు మాదకద్రవ్యాల వ్యసనాన్ని అధిగమించడానికి ఒక మార్గంగా కనిపిస్తుంది. అయినప్పటికీ రూకు మాదకద్రవ్యాల పట్ల ఉన్న మక్కువ, జూల్స్‌తో ఆమె సంబంధం చాలాసార్లు ఒడిదుడుకులకు లోనవుతాయి.

Advertisement

ఈ సిరీస్ లో రూతో పాటు, హైస్కూల్‌లోని ఇతర విద్యార్థుల కథనాలను కూడా ప్రతి ఎపిసోడ్‌లో వివరిస్తారు. వీరిలో నైట్ జాకబ్స్ అనే ఫుట్‌బాల్ ఆటగాడు ఉంటాడు. దూకుడుగా ఉండే అతని ప్రవర్తనతో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఒక్కో విద్యార్థి కథ ఒక్కోలా ఉంటుంది. చివరికి వీళ్ళ జీవితాలు ఎటు వెళ్తాయి ? మంచి ప్రవర్తనతో ఉంటారా ? విచ్చలవిడి జీవితానికి అలవాటు పడతారా ? రూ బెన్నెట్ డ్రగ్స్ తీసుకోవడం మానేస్తుందా ? అనే విషయాలను, ఈ టీన్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×