E-Paper
Advertisement

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా
Advertisement

Thai Horror Comedy: దెయ్యాల సినిమాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి భయపెట్టే సన్నివేశాలు, రక్తపాతం, జంప్ స్కేర్స్. కానీ ఒక దెయ్యం ఇంట్లో వాళ్లను భయపెట్టకుండా, వారికి తోడుగా ఉండి ఇంటి పనులన్నీ చేస్తే ఎలా ఉంటుంది ? అదే ఆలోచనతో తెరకెక్కిన థాయ్ హారర్ కామెడీ-డ్రామా ‘A Useful Ghost’. వినూత్నమైన కథతో ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఒకే కథలో అద్భుతంగా మిళితం చేసిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తూనే, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో కదిలిస్తుంది. మరి ఈ మూవీ తెలుగులో ఉందా ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

నటా అనే మహిళ తన కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ జీవిస్తుంది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె అకాల మరణం చెందుతుంది. తన భర్త, కుటుంబ సభ్యులు తన లేని లోటును ఎలా భరిస్తారో అనే ఆలోచన ఆమె ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వదు. ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా లేకపోతే వారి ఆరోగ్యం దెబ్బతింటుందనే భయంతో, ఆమె ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది.

Advertisement

అయితే సాధారణ హారర్ సినిమాల్లో చూపించినట్లు మనుషులపై దాడి చేయడం లేదా భయపెట్టడం ఆమె లక్ష్యం కాదు. ఇంట్లో ఉన్న రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌లోకి ప్రవేశించిన ఆమె ఆత్మ ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. నేల ఊడ్చడం, దుమ్ము తొలగించడం, గిన్నెలు కడగడం, ఇంటి పనులు చూసుకోవడం వంటి పనులన్నీ ఆ వాక్యూమ్ క్లీనర్ ద్వారానే జరుగుతుంటాయి. మొదట ఈ విచిత్ర సంఘటన చూసి కుటుంబ సభ్యులు భయపడినా, తర్వాత అది వారికి ఎలాంటి హాని చేయడం లేదని గ్రహిస్తారు.

క్రమంగా ఆ కుటుంబం ఆ వాక్యూమ్ క్లీనర్‌తో ఒక సభ్యుడిలా జీవించడం ప్రారంభిస్తుంది. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడంతో పరిస్థితులు మారిపోతాయి. దెయ్యంతో కలిసి జీవిస్తున్న కుటుంబంగా సమాజం వారిని ఎలా చూస్తుంది ? ఈ విచిత్రమైన బంధాన్ని ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు ? కుటుంబ సభ్యుల కోసం ఆ ఆత్మ ఎంతవరకు త్యాగం చేస్తుంది ? అనే ప్రశ్నలతో కథ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

Advertisement

ఈ ప్రయాణంలో హాస్యభరితమైన సంఘటనలు ఒకవైపు నవ్విస్తే, మరోవైపు కుటుంబ అనుబంధాలు, ప్రేమ, విడిపోవడం వంటి భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. చివరికి నటా ఆత్మకు విముక్తి లభించిందా ? లేక తన కుటుంబాన్ని వదిలి వెళ్లలేక మరో నిర్ణయం తీసుకుందా ? అనే అంశాలను మాత్రం సినిమాలో చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

హారర్ సినిమాల్లో కొత్తదనం కోరుకునే వారికి ఇది తప్పకుండా నచ్చే చిత్రం ఇది. రక్తపాతం, భయంకరమైన సన్నివేశాల కంటే కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇచ్చిన హర్రర్ కథ, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను ప్రధాన పాత్రగా మార్చిన వినూత్న ఆలోచన, థాయ్ దర్శకుడు రాట్చాఫూమ్ బూన్‌బంచాచోక్ తెరకెక్కించిన సున్నితమైన కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. కామెడీతో పాటు క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

ప్రస్తుతం ‘ఎ యౌజ్ ఫుల్ ఘోస్ట్’ MUBI ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది థాయ్ భాషలో అందుబాటులో ఉండగా, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. తెలుగులో మాత్రం లేదు. సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా, ప్రేమ, కుటుంబం, అనుబంధాలను కొత్త కోణంలో చూపించే ఫీల్‌గుడ్ హారర్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీ వర్త్ వాచింగ్ మావా.

Read Also: దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

Tags

Related News

ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

జెన్ జీ మెచ్చే అచ్చ తెలుగు సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా

హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

Big Stories

Advertisement
×