E-Paper
Advertisement

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ
Advertisement

Demon Slayer Movie: యానిమే అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘డెమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1’ (Demon Slayer: Infinity Castle Part 1) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి, రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది. డెమోన్ స్లేయర్ కథలోని అత్యంత కీలకమైన క్లైమాక్స్ ట్రైలజీలో ఇది మొదటి భాగం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అద్భుతమైన యానిమేషన్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ మూమెంట్స్, ఊహించని పోరాటాలతో ఈ సినిమా మొదటి నిమిషం నుంచి చివరి వరకు ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు యానిమే అభిమానులకు ఇది మరింత స్పెషల్‌గా మారింది. మరి ఇంతకీ ఈ యానిమే మూవీని తెలుగులో ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రాక్షసుల రాజు ముజాన్ కిబుట్సుజిని అంతం చేయడానికి తాంజిరో కమాడోతో పాటు డెమోన్ స్లేయర్ కార్ప్స్, హషీరాలు అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి ముగింపు పలకాలని నిర్ణయించిన వీరందరూ చివరి యుద్ధానికి సిద్ధమవుతారు. కానీ వారి ప్రతి కదలికను ముందుగానే ఊహించిన ముజాన్, వారందరినీ తన అత్యంత భయంకరమైన స్థావరమైన ఇన్ఫినిటీ క్యాసిల్లోకి లాగేస్తాడు.

Advertisement

అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సాధారణ కోటలా కనిపించినా, అది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉండే ఒక మాయా ప్రపంచం. ఒక్క క్షణంలోనే గోడలు, మెట్లు, గదులు అన్నీ తలకిందులవుతుంటాయి. దాంతో తాంజిరో, అతని స్నేహితులు, హషీరాలు ఒక్కొక్కరు ఒక్కో చోట విడిపోతారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన శత్రువులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇదే సమయంలో అప్పర్ ర్యాంక్ డెమన్స్ రంగంలోకి దిగడంతో యుద్ధం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ప్రతి ఫైట్‌లో ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒక్కో హషీరా తన పూర్తి శక్తిని బయట పెడుతుండగా, తాంజిరో కూడా తన జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సవాళ్లను ఎదుర్కొంటాడు. యాక్షన్ మాత్రమే కాదు, ప్రతి పాత్రలో దాగి ఉన్న భావోద్వేగాలను కూడా దర్శకుడు చాలా బాగా చూపించాడు.

Advertisement

అయితే ఈ యుద్ధంలో ఎవరు బతికారు ? ఎవరు ప్రాణాలు కోల్పోయారు ? ముజాన్‌ను అంతం చేసే దిశగా తాంజిరో బృందం ఎంతవరకు విజయం సాధించింది ? చివరి యుద్ధానికి ఈ మొదటి భాగం ఎలా నాంది పలికింది ? అనే కీలక విషయాలను మాత్రం సినిమాలో చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘డెమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1’ ప్రస్తుతం Crunchyrollతో పాటు Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, ఇంగ్లీష్, జపనీస్‌తో పాటు పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సుమారు 2 గంటల 35 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి ప్రముఖ Ufotable స్టూడియో యానిమేషన్ అందించింది. ముఖ్యంగా ఇన్ఫినిటీ క్యాసిల్ విజువల్స్, భారీ ఫైట్ సీక్వెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

యానిమేషన్ అంటే కేవలం పిల్లల వినోదం మాత్రమే కాదని మరోసారి నిరూపించిన చిత్రం ‘డెమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1’. అద్భుతమైన విజువల్స్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. డెమోన్ స్లేయర్ అభిమానులు మాత్రమే కాదు, మంచి ఫాంటసీ యాక్షన్ కథలను ఇష్టపడే వారు కూడా ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ వీక్ ఒక గ్రాండ్ యానిమే థ్రిల్ కావాలనుకుంటే దీనిని తప్పకుండా చూడండి.

Read Also: నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్

Tags

Related News

ఓటీటీలోకి 2 మలయాళం సినిమాలు… ఒకటి థ్రిల్లర్, మరొకటి ఫీల్‌గుడ్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఈ వారం 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు… తెలుగులోకి డబ్బింగ్ అయిన క్రేజీ మూవీస్ ఇవే

ఇరుముడి: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో విమర్శలు?

రికార్డ్ ధరకి ‘డ్రాగన్’ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

జెన్ జీ మెచ్చే అచ్చ తెలుగు సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Big Stories

Advertisement
×