BigTV English
Advertisement

OTT Movie : అందమైన సైకో నర్స్… గెలికి అడ్డంగా బుక్కయ్యే బిత్తిరి ఫ్యామిలీ… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు

OTT Movie : అందమైన సైకో నర్స్… గెలికి అడ్డంగా బుక్కయ్యే బిత్తిరి ఫ్యామిలీ… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు

OTT Movie : ఒక అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఒక సైకో నర్స్ చేసే అరాచకాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అమాయకంగా నటిస్తూనే మనుషులను చంపే ఈ సైకో నర్స్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఈవిల్ ఇంటెంట్’ (Evil intent). 2019లో వచ్చిన ఈ సినిమాకి మైఖేల్ ఫీఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒక సైకో నర్స్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2019 జూలై 20న కెనడాలో విడుదలైంది.  ఈ సినిమాలో లిండన్ స్మిత్ (గ్వెన్‌గా), అబ్బీ కాబ్ (మీరాగా), సీన్ ఫారిస్ (టాడ్‌గా), గ్రిఫిన్ మోర్గాన్ (మాక్స్‌గా), రోలాండా వాట్స్ (డాక్టర్ కెల్లర్‌గా) జే విల్కిన్స్ (డేవిడ్ వెబ్బర్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

మీరా, టాడ్ అనే జంటకు మాక్స్‌ అనే కొడుకు ఉంటాడు. మాక్స్‌కి మస్కులర్ డిస్ట్రోఫీ అనే అనారోగ్యం ఉంటుంది. అతన్ని చూసుకోవడానికి వాళ్లు గ్వెన్ అనే నర్స్‌ను ఇంట్లో పని చేయడానికి నియమిస్తారు. గ్వెన్ మొదట్లో చాలా మంచిగా, ఆప్యాయంగా కనిపిస్తుంది. మాక్స్‌తో బాగా కలిసిపోతుంది. కుటుంబంలో ఒకరిలా అయిపోతుంది. కానీ కొంత సమయం తర్వాత, గ్వెన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆమెకు ముంచౌసెన్ సిండ్రోమ్ అనే మానసిక సమస్య ఉందని తెలుస్తుంది. ఆమె మీరాను కుటుంబం నుండి దూరం చేసి, తనే తల్లి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. గ్వెన్ గతంలో ఒక క్యాన్సర్ రోగి అయిన లారెల్‌ను చూసుకుంది. అప్పుడు ఆమె లారెల్‌ను మోసం చేసి, ఆమె చనిపోయేలా చేసిందని తెలుస్తుంది.

Read Also : ఐఎండీబీలో 8.5 రేటింగ్… స్టార్ హీరో కాదు, రొమాన్స్ అంతకన్నా లేదు… ఓటీటీలో దంచికొడుతున్న వెబ్ సిరీస్

ఇప్పుడు గ్వెన్ మీరాకు డ్రగ్స్ ఇచ్చి, ఆమెను మత్తులో ఉంచుతుంది. మీరా నిర్లక్ష్యంగా కనిపించేలా, టాడ్‌తో గొడవలు సృష్టిస్తుంది. మాక్స్ క్రచెస్‌ను పాడు చేస్తుంది. ఆమె ఎక్కువగా తనపై ఆధారపడేలా చేస్తుంది. ఒక డాక్టర్‌ను కూడా డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో చంపేస్తుంది. తన గత రహస్యాలు బయటపడకుండా జాగ్రత్తపడుతుంది. మీరాకి క్రమంగా గ్వెన్ మీద అనుమానం వస్తుంది. డేవిడ్ వెబ్బర్ అనే వ్యక్తి నుండి గ్వెన్ గతం గురించి తెలుస్తుంది. మీరా గ్వెన్‌తో పోరాడి తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. గ్వెన్‌తో మీరా ఎలా పోరాడుతుంది ? మీరా తన కుటుంబాన్ని కాపాడుకుంటుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×