Nellore News: నెల్లూరు జిల్లాలో ఓ రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న గుడూరు శ్రీకాంత్ ఆస్పత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో మహిళా సన్నిహితంగా ఉన్నట్టు వీడియో కనిపిస్తోంది.
అయితే.. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మహిళతో సన్నిహతంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పోలీసులే సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో పోలీసులు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజలు, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోలీసురు సహకారంతోనే ఆ ఘటన జరిగి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ
ఓ మర్డర్ కేసులో శ్రీకాంత్ జీవిత ఖైదీగా కొన్ని సంవత్సరాల నుంచి జైలు గడుపుతున్నారు. నెల్లూరులో ఓ బార్ వద్ద యజమానిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి అతను అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే చెకప్ కోసం పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రి వద్దకు చేరుకోగానే ఆయన చేతికి బైక్ ఢీకొనడంతో దెబ్బతగిలింది. దీంతో వెంటనే అతడిని పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ గ్యాప్ లోనే మహిళతో రాసలీల వ్యవహారం జరిపాడు ఈ రౌడీ షీటర్.. అతని ట్రీట్ మెంట్ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి తరలించాలని పోలీసులు భావించారు.
ALSO READ: Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?
అయితే.. ఇదే అనువుగా తీసుకున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు వీడియో కనిపిస్తోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. శ్రీకాంత్ బయటకు వచ్చిన తనకు తెలియదని సంబంధిత మహిళ చెబుతోంది. ఏదైననప్పటికీ పోలీసులు ఇలా నిర్లక్ష్యం వహించడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.