E-Paper
Advertisement

OTT Movie : రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్… ఎక్కడ ఉందో తెలుసా ?

OTT Movie : రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్… ఎక్కడ ఉందో తెలుసా ?
Advertisement

OTT Movie : 2025లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కాబట్టి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీలలో థ్రిల్లర్ సిరీస్ లు దూసుకెళ్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టును రిలీజ్ చేస్తున్న ఆర్మాక్స్ నివేదిక ప్రకారం ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ టాప్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. గత రెండు సీజన్లు హిట్ కావడంతో ఈ సీజన్ కి హైప్ క్రియేట్ అయింది. నవంబర్ 24 నుంచి 30వరకు టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న సిరీస్ లు ఇవే.

‘ది ఫ్యామిలీ మ్యాన్’

రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గత వారం 7 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల తరువాత నవంబర్ 21న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ని ఆడియన్స్ తెగ చూస్తున్నారు. దీంతో రెండు వారాలుగా ఇది తొలి స్థానంలోనే ఉంటోంది. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’

Advertisement

గత శుక్రవారం నాలుగు ఎపిసోడ్లను మాత్రామే రిలీజ్ చేశారు. మిగతా ఎపిసోడ్స్ డిసెంబర్ 25కి, ఫైనాల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న రిలీజ్ కానున్నాయి. డఫర్ బ్రదర్స్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్ టాప్ 2లో కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.5 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 3’

వర్తిక చతుర్వేది (షెఫాలీ షా) పిల్లలు మిస్సింగ్ కేసును కొత్త ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీని వెనుక ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఉండటంతో ధీటుగా ఎదుర్కొంటుంది. రియల్ లైఫ్ స్టోరీతో పవర్‌ఫుల్ పర్ఫామెన్స్. 6 ఎపిసోడ్‌లు మాత్రమే కానీ ఒక్కటొక్కటి టెన్షన్ పెట్టేస్తుంది. ఈ సిరీస్ మూడో స్థానంలో 2.7 మిలియన్ వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. .

కో-ఎడ్

Advertisement

ఈ ఇండియన్ సిరీస్ కో ఎడ్యుకేషన్ లో చదివే టీనేజ్ పిల్లల చుట్టూ తిరుగుతుంది. రీసెంట్ గా వచ్చిన ఈ సిరీస్ కి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ సిరీస్ గత వారం 2.2 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది. రావడం విశేషం. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో దీనికి ఫ్రీగానే చూడొచ్చు.

జిద్దీ ఇష్క్

ఆదితి అనే అమ్మాయి పరంబ్రత చటర్జీ (షికార్ దా) మీద పిచ్చి ప్రేమలో పడుతుంది. కానీ అతను ఆమెను రిజెక్ట్ చేస్తాడు. ఆమె సూసైడ్ చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక అక్కడి నుంచి రివెంజ్ మోడ్ లో స్టోరీ ఉంటుంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్ లో 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లో 1.7 మిలియన్ వ్యూస్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

Big Stories

Advertisement
×