E-Paper
Advertisement

Laptop Charging Tips: ల్యాపీ ఛార్జింగ్ త్వరగా అయిపోకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించేయండి మరి!

Laptop Charging Tips: ల్యాపీ ఛార్జింగ్ త్వరగా అయిపోకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించేయండి మరి!
Advertisement

Laptop Charging Tips: నేటి కంప్యూటర్ యుగంలో యంత్రాల వాడకం విపరీతంగా పెరిగింది. ఆఫీసులో అయినా.. వర్క్ ఫ్రం హోం అయినా.. ఆన్‌లైన్ క్లాసులైనా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, ఆన్‌లైన్ గేమ్స్‌కు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ల్యాపీలే బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. అయితే, ల్యాప్‌టాప్‌ల వాడకంలో కొన్నిసార్లు ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. వాటిలో ఛార్జింగ్ సమస్య ఒకటి. అందుకే ల్యాప్‌టాప్‌ చార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలంటే.. కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించాలి. దీనివల్ల ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

అనవసరైమన ఫీచర్లు వద్దు:

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మీకు అవసరం లేని యాప్స్‌‌ను ల్యాప్‌టాప్ నుంచి డిలీట్‌ చేయడం, అనవసరం అనుకున్న ఫీచర్లను ఆఫ్‌ చేసుకోవడం, క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం సహా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్‌‌ను మెరుగుపరుచుకోవచ్చు.

ఒరిజినల్‌ ఛార్జర్లనే వాడాలి:

Advertisement

చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే.. మీ ల్యాప్‌టాప్ బ్రాండ్ ఛార్జర్ కాకుండా.. ఏది పడితే(వేరే బ్రాండ్స్) ఆ ఛార్జర్లను కనెక్టు చేయడం. ల్యాప్‌టాప్‌‌లు కొనుగోలు చేసేటప్పుడు వాటి ఛార్జర్‌లను సంస్థలు అందిస్తుంటాయి. కాబట్టి.. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోకుండా ఉండాలంటే ఇతర ఛార్జర్లను వాడకూడదు. ఒరిజినల్ ఛార్జర్లను ఉపయోగించడంవల్ల ల్యాప్‌టాప్ యొక్క బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది.

అప్డేట్స్‌ను ఫాలో అవ్వాలి:

మీ ల్యాప్‌టాప్‌‌లో ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్‌ వచ్చేందుకు.. వీలుగా బ్యాటరీ సేవర్ మోడ్ లేదా పవర్ సేవర్ మోడ్ లాంటి అప్డేటెడ్ ఫీచర్‌లను ఉపయోగించుకోవాలి. ఈ అధునాతన ఫీచర్‌‌లు మీ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్‌ మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

గరిష్ఠంగా 90%.. కనిష్ఠంగా 20%:

Advertisement

చాలామంది ల్యాప్‌టాప్‌కు ఇష్టానుసారంగా ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలాంటి అలవాట్లు మీ ల్యాప్‌టాప్‌ బ్యాటరీని దెబ్బ తీస్తుంటుంది. కాబట్టి.. 80% – 90 % వరకు మాత్రమే ఛార్జింగ్‌ చేయాలి. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ల్యాప్‌టాప్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌‌ను అందిస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×