E-Paper
Advertisement

ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Thriller Movie : సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను నమ్మితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీలో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రను పోషించింది. ఆమె అభిమానులు సైతం ఈ పాత్రలో ఐశ్వర్యను ఊహించుకోలేరు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు ‘ఫర్హాన’. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇంటెన్స్ సైకాలజికల్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందింది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ మధ్యతరగతి మహిళ చుట్టూ తిరిగే మూవీ ఇది. ఆ అపరిచిత ప్రమాదం ఎలాంటి ముప్పు తెచ్చి పెట్టింది ? అన్న స్టోరీ లైవ్ తో తెరకెక్కింది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

చెన్నైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి ‘ఫర్హాన’. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త కరీం ఒక చిన్న చెప్పుల షాప్ నడుపుతాడు. కానీ దానివల్ల వచ్చే ఆదాయం మాత్రం అంతంతే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా చిన్న పాప అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్హాన ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇంట్లో పెత్తనమంతా చెలాయించే మామ గారికి ఇష్టం లేకపోయినా సరే ఆమె ఒక బ్యాంక్ కాల్ సెంటర్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అవుతుంది.

Advertisement

ఆ జాబ్ లో ఎక్కువ జీతం, ఇన్సెంటివ్ రావు. అలా వస్తాయని తెలుసుకుని తన స్నేహితురాలు సాయంతో అదే కంపెనీలో మరో విభాగానికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. ఫ్రెండ్షిప్ చాట్ లైన్ అనే ఈ విభాగంలో చాలా చాలామంది అమ్మాయిలు పని చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ చేసే పని ఏంటో తెలిస్తే మెంటల్ ఎక్కాల్సిందే. ఒంటరిగా ఉండే అబ్బాయిలతో అసభ్యకరంగా మాట్లాడడమే ఆ జాబ్. అయితే అప్పటికే ఉద్యోగం చేస్తున్న ఆమె ఫ్రెండ్ ఇందులో బాగానే సంపాదిస్తుంది. కానీ ఇలాంటి పని చేయాల్సి వస్తుందని తెలిసి హీరోయిన్ ముందుగా అసహ్యించుకుంటుంది.

కానీ ఆర్థిక అవసరాల కోసం ఆ పని చేయక తప్పదు. ఈ క్రమంలోనే ఓ రోజు కాల్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడతాడు. దీంతో అతని మాటలకు ఆకర్షితురాలైన ఫర్హాన ప్రతిరోజు అతనితో మాట్లాడడం మొదలు పెడుతుంది. అతను తన పేరు దయాళన్ పరిచయం చేసుకుంటాడు. కానీ నిజానికి ఈ కంపెనీ రూల్స్ ప్రకారం ఫర్హాన అపరిచితులను వ్యక్తిగతంగా కలవకూడదు. తనకు సంబంధించిన డీటెయిల్స్ ని వాళ్ళకి ఇవ్వకూడదు. హీరోయిన్ ఆ రూల్స్ ని బ్రేక్ చేసి అతన్ని కలవడానికి సిద్ధపడుతుంది. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అతను కేవలం ఒక కాలర్ మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని నరకంగా మార్చాలని చూసే ఓ సైకో అని తెలుస్తుంది. అతను ఫర్హాన రహస్యాలని తెలుసుకొని ఆమెను ఆమె కుటుంబాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడు ? అతని మానసిక వేధింపుల వలయం నుండి ఫర్హాన ఎలా బయటపడింది ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Advertisement

Read Also : పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×