OTT Movie : సైబర్ నేరాలురోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది వీటి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా కొన్ని సందర్భాలలో చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక ముస్లిం కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆసక్తికరంగా సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ఫర్హానా’ (Farhana) 2023 లో వచ్చిన తమిళ థ్రిల్లర్ చిత్రం. దీనికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో S. R. ప్రకాశ్ బాబు, S. R. ప్రభు దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ టైటిల్ పాత్రలో నటించగా, జితన్ రమేష్, కె. సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్త, అనుమోల్ సహాయక పాత్రల్లో నటించారు. చెన్నైలోని ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో కాల్ సెంటర్ ఉద్యోగం చేసే ఒక మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, VJ సబు జోసెఫ్ ఎడిటింగ్‌తో రూపొందింది. ‘ఫర్హానా’ 2023 మే 12న థియేటర్లలో విడుదలైంది. సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. IMDbలో 6.4/10 రేటింగ్ తో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.
స్టోరీలోకి వెళితే
ఫర్హానా (ఐశ్వర్య రాజేష్) చెన్నైలోని ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తన భర్త కరీమ్ (జితన్ రమేష్), ముగ్గురు చిన్న పిల్లలు, ఆమె తండ్రి అజీజ్ భాయ్ (కిట్టీ)తో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంటుంది. కరీమ్, అజీజ్ భాయ్ నడిపే చెప్పుల దుకాణం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పుడూ డబ్బు కొరతతో సతమతమవుతుంటుంది. ఫర్హానా తన కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, ఒక బ్యాంక్ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సంపాదిస్తుంది. ఈ ఉద్యోగం ఆమెకు మొదటిసారిగా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కరీమ్ ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగిన భర్త. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాడు. కానీ అజీజ్ భాయ్ కి ఆమె బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. అయితే ఫర్హానా తన ఉద్యోగంలో బాగా రాణిస్తుంది.
ఈ సమయంలో ఆమె కుమారుడు నభా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో, వైద్య ఖర్చుల కోసం ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. ఆమె సహోద్యోగి నిత్య సలహాతో, ఫర్హానా ఎక్కువ ఇన్సెంటివ్‌లు ఇచ్చే “ఫ్రెండ్లీ చాట్” విభాగంలోకి మారుతుంది. ఇక్కడ ఆమె అపరిచితులతో రొమాంటిక్ చాట్‌లు చేయాల్సి ఉంటుంది. మొదట ఈ ఉద్యోగం ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సాంప్రదాయ ముస్లిం నేపథ్యం నుండి వచ్చింది. కానీ ఒక రోజు ధయాళన్ అనే కాలర్ ఆమెతో మాట్లాడతాడు. అతను రొమాంటిక్ చాట్‌లకు బదులు కవితాత్మకంగా మాట్లాడతాడు. ఫర్హానా తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సంభాషణలు వినలేదు. ధయాళన్‌తో మాట్లాడడం ఆమెకు ఆనందాన్ని ఇస్తుంది. వీళ్ళు రోజూ మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఈ సంభాషణలు ఆమెను ఒక రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తుంటాయి. ఆమె ధయాళన్‌పై ఇష్టం పెంచుకుంటుంది.
Read Also : అర్ధరాత్రి ఆ పని చేసే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కేసు
కానీ అతను ఆమెను మరింత మానసికంగా హింసిస్తాడు. ఆమెను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. ఈ ప్రమాదకరమైన గేమ్ ఫర్హానా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. చివరకు ఫర్హానా ఈ బెదిరింపులను భరించలేక, ధయాళన్‌ను ఎదిరించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె సాంకేతికతను ఉపయోగించి అతన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్టోరీ ఇప్పుడు ఒక థ్రిల్లింగ్ క్యాట్-అండ్-మౌస్ గేమ్ గా టర్న్ తీసుకుంటుంది. ధయాళన్‌ను ఫర్హానా ఎలా ఎదుర్కొంటుంది ? ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.