OTT Movie : ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ లేపుతోంది. ఊహించని ట్విస్టులతో ఈ సిరీస్ అదరగొడుతోంది. ఒక మర్డర్ మిస్టరీని టైమ్ ట్రావెల్ చేసి తెలుసుకునే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. దీని అద్భుతమైన BGM, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సిరీస్‌ను ఒక రోలర్ కోస్టర్ రైడ్‌గా మారుస్తాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
చోర్కీలో స్ట్రీమింగ్
‘కాలపురుష్’ (Kaalpurush) 2024లో విడుదలైన ఒక బెంగాలీ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్. దీనికి సల్జార్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో చంచల్ చౌధురీ, ఎఫ్ఎస్ నయీమ్, తంజికా అమిన్, ఇమ్తియాజ్ బర్షన్, ప్రియోంటీ ఉర్బీ ప్రధాన పాత్రల్లో నటించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ చోర్కీలో 2024 మే 23న విడుదలైన ఈ సిరీస్, ఏడు ఎపిసోడ్‌లతో (ప్రతి ఎపిసోడ్ 24-25 నిమిషాలు) ఒక మర్డర్ మిస్టరీని సైన్స్-ఫిక్షన్ టైమ్ ట్రావెల్ అంశాలతో కలుపుతుంది. IMDbలో 8.8/10 రేటింగ్‌తో ఈ సిరీస్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం ప్రశంసలు అందుకుంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ ధాకాలోని ధన్‌మండి లేక్ వద్ద ఒక రాత్రి జరిగిన ఫరియా అనే యువతి హత్య చుట్టూ తిరుగుతుంది. డిటెక్టివ్ మిరాజ్ (ఎఫ్ఎస్ నయీమ్) ఈ కేసును ఛేదించడానికి నియమించబడతాడు. మిరాజ్ ఒక అసమర్థ పోలీసు అధికారి. ఎందుకంటే అతను వ్యక్తిగత జీవితంలో సతమతమవుతుంటాడు. వివాహంలో ఒడిదుడుకులతో పాటు తన సహోద్యోగులతో కూడా అతని ప్రవర్తన సరిగ్గాఉండదు. అతని సహాయకుడు జహంగీర్ (ఇమ్తియాజ్ బర్షన్) కూడా కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. కానీ అతను మిరాజ్‌తో ప్రతివిషయంలో పోటీ మనస్తత్వంతో ఉంటాడు. మొదట ఈ హత్య ఒక సాధారణ క్రైమ్ కేసులా కనిపిస్తుంది. ఫరియా ఒక హిందూ అమ్మాయి, ఒక పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందని, ఆ సంబంధం హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తారు.
ఈ వ్యక్తి ఇంటికి వెళ్లినప్పుడు, పోలీసులు గోడపై వేలాడుతున్న రెండు ఫోటోలను చూస్తారు. ఇందులో ఒక ఫొటోలో ఘాజీ పీర్ అనే ముస్లిం సాధువు పులిపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. ఘాజీ పీర్ 400 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఒక హిందూ రాజు కుమార్తెను వివాహం చేసుకున్న చారిత్రక వ్యక్తి. ఈ చారిత్రక ఘటన, ఫరియా హత్యతో లింక్ అయినట్లు అనిపిస్తుంది.ఇది కథకు ఒక ఆధ్యాత్మిక లింక్‌ను జోడిస్తుంది. ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ మిరాజ్, షెహజాద్ ఒక రహస్యమైన టైమ్ ట్రావెల్ పద్ధతిని ఉపయోగించి హత్య జరిగిన చోటుకి తిరిగి వెళతారు. ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి జ్ఞాపకాల ద్వారా టైమ్ ట్రావెల్ చేస్తారు. ఉదాహరణకు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు వందల సంవత్సరాల క్రితం చనిపోయినా, వాటి కాంతి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన జ్ఞాపకంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా, ఈ సిరీస్‌లో టైమ్ ట్రావెల్ ఒక మర్డర్ విట్నెస్ రక్తంలోని DNA ద్వారా జరుగుతుంది. ఇది ఆరోజు హత్య ఎలాజరిగిందో తిరిగి చూడటానికి వీలు కల్పిస్తుంది.
Read Also : మనుషులతో ఆడుకునే దెయ్యాలు… గెలిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్… ఓడితే నరకమే
మిరాజ్, షెహజాద్ హత్య రాత్రి సంఘటనలను తిరిగి చూస్తూ నిజమైన హంతకుడిని కనుగొనే ప్రయత్నంలో ఉంటారు. ఈ సమయంలో జహంగీర్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కొత్త రహస్యాలను తెరపైకి తెస్తుంది. కథలో ఒక పాత మర్డర్ కేసు ఈ కొత్త హత్యతో ముడిపడి ఉంటుంది. ఈ రెండు కేసులు కలిసి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడతాయి. ఇది మిరాజ్ మానసిక స్థితిని కూడా సవాలు చేస్తుంది. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఈ షాకింగ్ ట్విస్టులు ఏమిటి ? హంతకుడు ఎవరు ? అమ్మాయిలను ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? టైమ్ ట్రావెల్ లో ఎలాంటి సీక్రెట్స్ బయటపడతాయి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మర్డర్ మిస్టరీ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.