వర్షాలు పడే సమయంలో తరచుగా పిడుగులు పడుతుంటాయి. అందుకే, వర్షాలు పడే సమయంలో ఎవరూ బయటకు రాకూడదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తుంటారు. మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటన్నారు. మరోవైపు తరచుగా పిడుగులు పడే వీడియో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. చెట్ల మీద, ఇళ్ల మీద, సెల్ ఫోన్ టవర్ల మీద పిడుగులు పడటం, దాని తీవ్రతకు మంటలు చెలరేగడం గమనిస్తుంటాం. తాజాగా లైవ్ లో పిడుగు పాటును చూసి జనాలు షాక్ అయిన ఘటన బ్రిటన్ లో జరిగింది. ఏకంగా రన్ వే మీద ఉన్న విమానం మీదే పిడుగు పడటంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది కంగారు పడ్డారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?
కొద్ది రోజులుగా బ్రిటన్ లో వర్షాలు కురుస్తున్నాయి. రీసెంట్ గా తీవ్రమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వర్షం కురుస్తున్న సమయంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం రన్ వే మీద నిలిచి ఉన్నది. వాస్తవానికి ఈ విమానం బయల్దేరే సమయంలోనే వర్షం ఎక్కువ కావడంతో నిలిపివేశారు. కాసేపటికే ఒక్కసారిగా ఈ విమానం మీద పిడుగు పడింది. ఆకాశం నుంచి మెరపు జారిపడి విమానానికి తగిలింది. ఈ దృశ్యాలు ఎయిర్ పోర్టులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సావో పాలో గౌరుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
Amazing video captures lightning striking a British Airways A350-1041 at Sao Paulo Guarulhos International Airport.
Following an inspection the aircraft continued to its destination with a 6 hour delay.
📹 @bernaldinho79 pic.twitter.com/xNnTXmBCJ4
— Breaking Aviation News & Videos (@aviationbrk) January 25, 2025
ఎలాంటి నష్టం జరగలేదన్న ఎయిర్ పోర్టు సిబ్బంది!
విమానంపై పిడుగు పడటంతో ఎయిర్ పోర్టు అధికారులు కాసేపు కంగారు పడ్డారు. ఎలాంటి నష్టం వాటిల్లిందేమోనని పరిశీలించారు. వెంటనే, నిపుణులు బృందం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తునాయో? లేదో? అని చెక్ చేశారు. అయితే, ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తేల్చారు. విమానం కండీషన్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లు నిర్ధారించారు. భద్రతా పరిశీలన కారణంగా విమానం వెళ్లాల్సిన సమయాని కంటే సుమారు 6 గంటలు లేటుగా బయల్దేరాల్సి వచ్చింది.
Read Also: 13వ అంతస్తు నుంచి జారిపడ్డ చిన్నారి, అతడే లేకపోతే..
పిడుగులను తట్టుకునేలా విమానాల తయారీ
వాస్తవానికి విమానాలను పిడుగుల నుంచి తట్టుకునేలా ప్రత్యేకమైన లోహాలతో తయారు చేస్తారు. సాధారణంగా విమానాల మీద పిడుగులు పడినా ఎలాంటి ముప్పు కలగదంటున్నారు నిపుణులు. అయితే, కొన్నిసార్లు అధిక శక్తితో కూడిన పిడుగులు పడుతాయని, అలాంటి సమయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే, వీలైనంత వరకు ఉరుములు, మెరుపులతో కూడిన సమయంలో విమానాలు టేకాఫ్ కు ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించరని వెల్లడించారు. ప్రయాణీకుల రక్షణ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయరంటున్నారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు గానీ, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదనే సూత్రం ప్రకారం ఎయిర్ పోర్టు అధికారులు వ్యవహరిస్తారని చెప్తున్నారు.
Read Also: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు, ముక్కలు ముక్కలైన యువతి!