OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు గ్రిప్పింగ్ నరేషన్ తో, ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపలేనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “Fatal Attraction”. 1987 లో రిలీజ్ అయిన ఈ మూవీకి అడ్రియన్ లైన్ దర్శకత్వం వహించారు. ఇదొక ఐకానిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మైకెల్ డగ్లస్ (డాన్ గాలఘర్), గ్లెన్ క్లోజ్ (అలెక్స్ ఫారెస్ట్), అన్నే ఆర్చర్ (బెత్ గాలఘర్) ప్రధాన పాత్రల్లో నటించారు, ఎల్లెన్ లాట్జెన్ (ఎల్లెన్ గాలఘర్) సహాయక పాత్రలో నటించింది. ఈ సినిమాకు జేమ్స్ డీర్డెన్ స్క్రీన్‌ప్లే రాశారు. అతని 1980 షార్ట్ ఫిల్మ్ “Diversion” నుండి స్ఫూర్తి పొందింది ఈ మూవీ. ఈ సినిమా Amazon Prime Video, Netflix వంటి OTT ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో అనవసరమైన అబ్సెషన్, స్టాకింగ్, పెళ్లయ్యాక కూడా మరొకరిపై మోజు పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయాలను మేకర్స్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ సినిమాను చూశాక జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళరు.
కథలోకి వెళ్తే..
డాన్ గాలఘర్ న్యూయార్క్‌లో ఒక సక్సెస్ ఫుల్ న్యాయవాది. తన భార్య బెత్, కుమార్తె ఎల్లెన్ తో సంతోషకరమైన జీవితం గడుపుతాడు. ఒక వ్యాపార సమావేశంలో అతను అలెక్స్ ఫారెస్ట్‌ను కలుస్తాడు. ఇద్దరి మధ్య గంటల వ్యవధిలోనే స్నేహం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీస్తుంది. సాధారణంగా మన దగ్గర కూడా అలాంటివి జరుగుతాయన్న విషయం తెలిసిందే. కానీ విదేశాల్లో యథేచ్ఛగా జరుగుతాయని కూడా తెలిసిందే.
వన్ నైట్ స్టాండ్ అన్నట్టుగా ఇద్దరూ రాత్రంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్నీ డాన్ సాధారణ అనుభవంగా భావిస్తాడు. అయితే, అలెక్స్ అతని పట్ల తీవ్రమైన, అనారోగ్యకరమైన ఆకర్షణకు లోనవుతుంది. ఇంకేముంది అతను ఆమెను వదిలేసినా, ఆమె మాత్రం అతనిని ఫాలో అవ్వడం, ఊరికే ఫోన్ కాల్స్ చేసి విసిగించడం, అతని ఫ్యామిలీ లైఫ్ లోకి చొరబడటం ప్రారంభిస్తుంది. అలెక్స్ ప్రవర్తన క్రమంగా బెదిరింపులు, హింసాత్మక చర్యలుగా మారుతుంది.
ఆమె ఎంత టార్చర్ పెడుతుందంటే… డాన్ కుమార్తె పెంపుడు జంతువును చంపడం, డాన్ ఇంటిపై దాడి చేయడం వంటి చర్యలకు దిగుతుంది. డాన్ తనకు ఆమెతో ఉన్న సంబంధాన్ని, తాను చేసిన తప్పును భార్య బెత్ కు చెప్పేస్తాడు. కానీ అలెక్స్ సమస్య పరిష్కారం కాకపోగా, ఆమె భార్యాభర్తలు ఇద్దరినీ బెదిరిస్తుంది. ఇది ఒక ఉత్కంఠభరితమైన, భయంకరమైన ముగింపుకు దారి తీస్తుంది. మరి మూవీ ఎలా ఎండ్ అయ్యింది? ఆమె నుంచి ఆ భార్యాభర్తలు తప్పించుకోగలిగారా? పెళ్లయింది అని తెలిసి కూడా డాన్ తో అలెక్స్ ఎందుకు అలా బిహేవ్ చేసింది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.