Horror Slasher Movie: అందాల పోటీలు చూడడానికి ఎంత బాగుంటాయో కదా. కానీ అలాంటి పోటీలకు వెళ్ళే అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపేసే సైకో ఎదురు పడితే ? ఈ భయంకరమైన ఊహను ‘ఫియర్ స్ట్రీట్: ప్రోమ్ క్వీన్’ (Fear Street: Prom Queen 2025) అనే హారర్ స్లాషర్ సినిమా ద్వారా నిజం చేశారు మేకర్స్. మరి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథ 1988వ సంవత్సరంలో శాడీసైడ్ హైస్కూల్ అనే నేపథ్యంలో సాగుతుంది. ఆ స్కూల్‌లో ‘ప్రోమ్ నైట్’ అనే ఈవెంట్ జరుగుతుంది. అంటే సీనియర్ విద్యార్థుల డ్యాన్స్ పార్టీ వేడుకలు దగ్గర పడుతుంటాయి. స్కూల్ లో అందరి కంటే అందంగా, పాపులర్‌గా ఉండే ‘ఇట్ గర్ల్స్’ బృందం ఎలాగైనా ‘ప్రోమ్ క్వీన్’ కిరీటాన్ని గెలవాలని పోటీ పడుతుంటారు. అదే స్కూల్ కు చెందిన లోరి గ్రేంజర్ అనే అమ్మాయి ఇక్కడే కథలోకి ఎంట్రీ ఇస్తుంది. తాను సాధారణ అమ్మాయే కానీ ధైర్యవంతురాలు. అయితే ఆమె ఆ స్కూల్ లో అవుట్ సైడర్ అన్నమాట. తన కుటుంబానికి జరిగిన అవమానాలకు, చెడిపోయిన పేరుకు ప్రతిఫలంగా.. ఎలాగైనా ఈసారి ‘ప్రోమ్ క్వీన్’ పోటీలో గెలిచి తన సత్తా చాటాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఆమె కూడా పోటీకి నామినేట్ అవుతుంది.
కథలో ఇక్కడి నుంచి వరుస హత్యల కలకలం మొదలవుతుంది. లోరి ఈ పోటీలోకి ప్రవేశించినప్పటి నుండి స్కూల్ లో విచిత్రమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రోమ్ క్వీన్ రేసులో ఉన్న మిగతా పాపులర్ అమ్మాయిలు ఒక్కొక్కరుగా మయం అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక ముసుగు ధరించిన సైకో కిల్లర్ చాలా క్రూరంగా వాళ్ళను మర్డర్ చేస్తాడు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఈ హత్యలన్నీ లోరిని ఇరికించడానికే జరుగుతున్నాయా ? లేదా స్కూల్‌లో ఉన్న పాత శాడీసైడ్ శాపం వల్ల జరుగుతున్నాయా ? అని లోరి స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడుతుంది.
ఆ భయంకరమైన రాత్రి క్లైమాక్స్ లో అసలైన కిల్లర్ ఎవరో తెలిసి లోరి షాక్ కు గురవుతుంది. పోటీలో ఉన్న మరో అమ్మాయి టిఫానీ ఫాల్కనర్ (ఫినా స్ట్రాజా), ఆమె తల్లిదండ్రులే ఈ హత్యల వెనుక ఉన్నారని లోరికి తెలుస్తుంది. టిఫానీని ఎలాగైనా ప్రోమ్ క్వీన్ చేయాలనే పిచ్చితో ఆమె తల్లిదండ్రులు ఈ ఘోరమైన ప్లాన్ వేస్తారు. చివరికి లోరి వారితో పోరాడి ఎలా ప్రాణాలతో బయటపడింది ? అలాగే ఈ ఊరికున్న రహస్య అతీత శక్తుల శాపానికి, దీనికి ఉన్న లింక్ ఏంటి ? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సిరీస్ Netflixలో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ భాషలో అందుబాటులో ఉంది. ఈ టీన్ హారర్, స్లాషర్, మిస్టరీ థ్రిల్లర్ మే 23 నుండి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ రచయిత ఆర్.ఎల్. స్టైన్ రాసిన ‘ది ప్రోమ్ క్వీన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలతో చూడకుండా ఉంటేనే బెటర్.
Read Also: ఈ ఆడదెయ్యానికి దేవుళ్లంతా బంధువులే… ప్యాంట్ తడిపించే సీన్లు మావా