E-Paper
Advertisement

Feel good Movie : ప్రేమ పెళ్లి… అందమైన ఫ్యామిలీ… కట్ చేస్తే నరకం చూపించే సైతాన్లు

Feel good Movie : ప్రేమ పెళ్లి… అందమైన ఫ్యామిలీ… కట్ చేస్తే నరకం చూపించే సైతాన్లు
Advertisement

Feel good Movie : ఒకేసారి నవ్వించి, ఏడిపించే సినిమాలు కూడా ఉన్నాయి. ఈ కంటెంట్ తో ఒక ఇటాలియన్ మూవీ మూడు ఆస్కార్ లు కూడా గెలిచింది. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో సాగుతుంది. ఈ అద్భుతమైన ఇటాలియన్ సినిమాకి ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా ఉంది. ఓ తండ్రి తన కొడుకును కాపాడుకునే సీన్స్ ఇందులో అద్భుతంగా చూపించారు. ప్రాణాలు పోతున్నా తన కొడుకు కోసం పడే తపన కన్నీరు పెట్టిస్తుంది. జీవితంలో ఒక్క సారైనా చూడాల్సిన అద్భుతమైన సినిమా ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో చూడచ్చు

1997లో విడుదలైన ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ (Life Is Beautiful). ఈ సినిమాకు రాబర్టో బెనిగ్ని దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు కూడా. 1999లో మూడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది ఈ సినిమా. ఉత్తమ నటుడు (రాబర్టో బెనిగ్ని), ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సంగీతం విభాగాల్లో వరించాయి అవార్డులు. IMDbలో 8.6/10 రేటింగ్ చూస్తే అది ఎంత గొప్ప సినిమానో అర్థమవుతుంది. prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1930ల కాలం నాటి ఇటలీలో గైడో అనే ఒక యూదు యువకుడు చాలా ఫన్నీగా ఉంటాడు. అతను డోరా అనే అందమైన స్కూల్ టీచర్‌ని చూసి ఇష్టపడతాడు. తన కామెడీతో ఆమెను పడగొట్టేస్తాడు గైడో. ఇక ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్లకు జియోసు అనే ఒక క్యూట్ కొడుకు పుడతాడు. జీవితం ఆనందంగా ఉందనుకున్న సమయంలో గుండె బరువెక్కించే మలుపు తిరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల గైడోను, అతని కొడుకును నాజీ సైనికులు పట్టుకుని కాన్సంట్రేషన్ క్యాంపుకు (జైలు లాంటి చోటు) తీసుకెళ్తారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ చిన్న పిల్లాడైన జియోసు భయపడకూడదని గైడో ఒక ప్లాన్ వేస్తాడు. అక్కడ జరుగుతున్న హింసను చూసి తన కొడుకు భయపడకుండా ఉండటానికి, గైడో ఇదంతా ఒక గేమ్ అని అబద్ధం చెబుతాడు. మనం ఈ గేమ్‌లో రూల్స్ ఫాలో అయ్యి పాయింట్లు గెలిస్తే, మనకు ఒక నిజమైన యుద్ధ ట్యాంకు గిఫ్ట్‌గా వస్తుందని కొడుకును నమ్మిస్తాడు.

ఆకలి వేసినా, ఎవరైనా తిట్టినా, కొట్టినా అదంతా గేమ్‌లో భాగమే అని కవర్ చేస్తాడు. చివరికి సైనికులు తనను చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా, తన కొడుకు చూస్తున్నాడని తెలిసి, భయం బయటపడనీయకుండా ఒక బఫూన్ లాగా నడుస్తూ వాడిని నవ్విస్తాడు. గైడో చనిపోతాడు, కానీ అతని కొడుకు మాత్రం బ్రతుకుతాడు. యుద్ధం అయిపోయాక అమెరికన్ సైన్యం ట్యాంకు మీద రావడం చూసి, జియోసు ట్యాంకు వచ్చేసింది నేను గేమ్ గెలిచానని సంబరపడతాడు.తండ్రి చనిపోయాడని తెలియని ఆ పిల్లాడి ఆనందం, తన కొడుకు కోసం నవ్వుతూ ప్రాణాలిచ్చిన ఆ తండ్రి ప్రేమ… ఈ సినిమాను ఒక మాస్టర్ పీస్ చేశాయి.

Advertisement

Read Also : ఇండియన్ ఫుట్ బాల్ లెజెండ్ బయోపిక్… కట్టిపడేసిన అజయ్ నటన… స్పోర్ట్స్ ప్రియులకు ఫీస్ట్

Related News

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Big Stories

Advertisement
×