E-Paper
Advertisement

బంధాల వాల్యూ ఏంటో చూపించే ఒక వేశ్య స్టోరీ… లోన్లీనెస్ తో బాధపడే జనాలు కచ్చితంగా చూడాల్సిన సినిమా

బంధాల వాల్యూ ఏంటో చూపించే ఒక వేశ్య స్టోరీ… లోన్లీనెస్ తో బాధపడే జనాలు కచ్చితంగా చూడాల్సిన సినిమా
Advertisement

Feel Good Movie on OTT : మనసుకు హత్తుకునే ఒక ఫీల్ గుడ్ డ్రామా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమిస్తే పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే డైలాగ్ దీనికి కరెక్ట్ గా సరిపోతుంది. ఇందులో ఎలాంటి ఫైట్లు, పెద్ద ట్విస్టులు, భారీ డైలాగులు ఉండవు. మన జీవితంలో చూసే సాధారణ మనుషులు, వాళ్ళ ఎమోషన్స్ చుట్టూనే ఈ కథ నడుస్తుంది. సినిమా మొత్తం చాలా నెమ్మదిగా, ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూ, చూసే ప్రేక్షకుడి మనసుకు ఒక తెలియని ప్రశాంతతను ఇస్తుంది. మనసు బాలేనప్పుడు, కాస్త రిలాక్స్ అవ్వాలనిపించినప్పుడు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని చూడదగ్గ ఒక చక్కటి క్లాసిక్ సినిమా ఇది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ ఫీల్ గుడ్ డ్రామా మూవీ ఏరు ‘కాల్ మీ చిహిరో’ (Call Me Chihiro). 2023లో వచ్చిన ఈ సినిమాకు రికీయా ఇమైజుమి దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన చిహిరోగా ప్రముఖ నటి కసుమి అరిమురా నటించారు. ఆమెతో పాటు హనా తోయోషిమా (కునికో/ఒకాజీ పాత్రలో), బాలనటుడు తెట్టా షిమడా (మకోటో పాత్రలో) లిలీ ఫ్రాంకీ (ఉత్సుమి పాత్రలో) కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. దర్శకుడు రికీయా ఇమైజుమి ఎమోషన్స్ ను తెరపై చూపించడంలో దిట్ట. ఈ సినిమాలో కూడా ఆయన చిహిరో పాత్ర ద్వారా సమాజానికి దూరంగా ఉండే వ్యక్తుల మధ్య ఏర్పడే బంధాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికి ఐయండిబిలో 7.0/10 రేటింగ్ లభించింది. కథానాయిక కసుమి అరిమురా తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు కొనియాడారు. ఈ జపనీస్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో చిహిరో అనే అమ్మాయి గతంలో సెక్స్ వర్కర్‌గా పనిచేసి, ఆ జీవితాన్ని వదిలేసి ఒక చిన్న సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఒక ఊరికి వస్తుంది. అక్కడ ఒక చిన్న లంచ్ బాక్స్ హోటల్‌లో క్యాషియర్‌గా జాయిన్ అవుతుంది. సమాజం తన గురించి ఏమనుకుంటుందో అనే పట్టింపులు లేకుండా, ఎప్పుడూ నవ్వుతూ, అందరితో చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంది. ఆ ఊరిలో ఉండే రకరకాల ఒంటరి మనుషులు, మనశ్శాంతి లేని వాళ్లంతా అనుకోకుండా చిహిరోకు దగ్గరవుతారు. ఇంట్లో గొడవలతో విసిగిపోయిన ఒకాజీ అనే స్కూల్ అమ్మాయి, అమ్మ ప్రేమకు దూరమైన మకోటో అనే చిన్న అబ్బాయి, అలాగే ఒక గుడ్డి ముసలాయన.. ఇలా చాలామందికి చిహిరో ఒక మంచి స్నేహితురాలిగా మారుతుంది. వాళ్ల కష్టాలను వింటూ, వాళ్లకు నచ్చిన వంటలు చేసి పెడుతూ వాళ్ల ఒంటరితనాన్ని పోగొడుతుంది. అయితే అందరి బాధలను పోగొట్టే చిహిరో మనసులో కూడా ఒక తెలియని ఒంటరితనం ఉంటుంది. ఒకరికొకరు అండగా నిలబడుతూ, జీవితంలో ఎలా ముందుకు సాగాలనేదే ఈ సినిమా కథ.

Read Also : 18 ఏళ్ల యువకుడితో యవ్వారం నడిపే స్కూల్ టీచర్… రచ్చ రంబోలా సీన్లు ఉన్న సినిమా మావా

Tags

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×