Feel good Movie : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు ఆలోచనలో పడుతుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. జీవితం ఎంత చిన్నదో, దాన్ని మనకు నచ్చినట్లుగా ఎలా గడపాలో ఈ సినిమా చాలా సున్నితంగా చూపిస్తుంది. ఈ కథ చాలా ఎమోషనల్ గా ఉంటుంది కానీ, అక్కడక్కడ నవ్విస్తూ లైఫ్ మీద ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. త్వరలోనే చనిపోతానని తెలుసుకున్న ఒక సాదా సీదా వ్యక్తి, చివరి రోజుల్లో ఏం చేశాడనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘దాస్విదానియా’ (Dasvidaniya). ఇది ఒక రష్యన్ పదం, దీని అర్థం గుడ్ బై అని వస్తుంది. ఇందులో వినయ్ పాఠక్, రజత్ కపూర్, సరితా జోషి, నేహా ధూపియా ముఖ్య పాత్రలు పోషించారు. శశాంత్ షా దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని అమ్మ అనే పాటను కైలాష్ ఖేర్ చాలా అద్భుతంగా పాడారు. 2008 నవంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా రన్ టైమ్ సుమారు 1 గంట 53 నిమిషాల నిడివితో ఉంటుంది. యూట్యూబ్ లో ఈ సినిమాను ఫ్రీగానే చూడవచ్చు.
అమర్ కౌల్ అనే ఒక అమాయకపు మధ్యతరగతి వ్యక్తి ఉంటాడు. అతను ఆఫీసులో బాస్ తిట్లు తింటూ, ఇంట్లో వాళ్ల కోసం కష్టపడుతూ తనకంటూ ఒక సొంత జీవితం లేకుండా గడిపేస్తుంటాడు. సడన్‌గా ఒకరోజు తనకు క్యాన్సర్ ఉందని, ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతానని తెలిసి అతను షాక్ అవుతాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఇన్నేళ్లూ అందరి కోసం బతికాను కానీ, నా కోసం నేను ఏ రోజూ బతకలేదు అని దిగాలు పడతాడు. దీంతో తనకి మిగిలివున్న ఈ కొద్ది రోజుల్లోనైనా తన ముచ్చట్లు తీర్చుకోవాలని 10 పనులతో ఒక లిస్ట్ రాసుకుంటాడు.
ఆ లిస్ట్‌లో ఒక మంచి కారు కొనడం, గిటార్ నేర్చుకోవడం, రష్యాలో ఉన్న పాత దోస్తుని కలవడం, అలాగే చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయికి మనసులో మాట చెప్పడం లాంటివి ఉంటాయి. ఏ రోజూ గట్టిగా మాట్లాడని అమర్, చనిపోయే లోపు ఈ పనులన్నీ ఒక్కొక్కటిగా ఎలా పూర్తి చేశాడు? చివరి నిమిషంలో భయం లేకుండా సంతోషంగా తన జీవితానికి ఎలా వీడ్కోలు చెప్పాడు? అన్నదే ఈ సినిమా.
Read Also : రోడ్డున పడే బతుకులు… మనీ కోసం మాస్టర్ స్కెచ్ … క్లైమాక్స్ వరకు ట్విస్టులే