E-Paper
Advertisement

Feel good Movie OTT: నీడలా వెంట పడే మేఘం… ఎన్నో అవార్డులు, రేటింగులోనూ తోపే

Feel good Movie OTT: నీడలా వెంట పడే మేఘం… ఎన్నో అవార్డులు, రేటింగులోనూ తోపే
Advertisement

Feel good Movie OTT : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి కొన్ని అద్భుతమైన, ఆలోచింపజేసే సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మూవీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి గుర్తింపు పొందింది. ఈ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మామూలు వ్యక్తి , ఆకాశంలో ఉన్న ఒక మేఘంతో స్నేహం చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బెంగాలీ డ్రామా మూవీ పేరు ‘ది క్లౌడ్ అండ్ ది మ్యాన్ (The Cloud and the Man). బెంగాలీలో దీనిని మాణిక్‌బాబర్ మేఘ్ అని పిలుస్తారు. ఈ చిత్రానికి అభినందన్ బెనర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిడివి సుమారు 97 నిమిషాలు ఉంటుంది. ఫిప్రెస్సీ (FIPRESCI) ఇండియాలో 2021లో రూపొందించిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా ఈ సినిమాను ఎంపిక చేశారు. అంతేకాదు రష్యాలో జరిగిన 19వ పసిఫిక్ మెరిడియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చందన్ సేన్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమా 2021లోనే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడినప్పటికీ, థియేటర్లలో 2024 జూలై 12న విడుదలైంది. ఇందులో చందన్ సేన్, దేబేష్ రాయ్ చౌదరి, బ్రత్యా బసు, నిమాయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ముబి ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మాణిక్ అనే ఒక మామూలు మధ్యతరగతి మనిషి కోల్‌కతాలో ఒంటరిగా బతుకుతుంటాడు. పొద్దున్నే లేచి ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం రావడం తప్ప వేరే లోకం తెలీదు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కడే అయిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా పెద్దగా కలవడు, తన పనేదో తను చూసుకునే ఒక ముభావపు మనిషి. జీవితం అంతా చప్పగా సాగిపోతున్న టైంలో ఒక వింత జరుగుతుంది. ఒకరోజు బయటికి వెళ్తే, ఆకాశంలో ఒక మేఘం ఇతన్నే వెంబడించడం మొదలుపెడుతుంది. మాణిక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ మేఘం కూడా వెళ్తుంటుంది. మొదట్లో భయపడినా, మెల్లగా ఆ మేఘంతో అతనికి ఒక రకమైన స్నేహం ఏర్పడుతుంది.

అందరూ పిచ్చోడు అనుకున్నా సరే, తను మాత్రం ఆ మేఘంతో కబుర్లు చెప్పుకుంటూ, దానితోనే తన ప్రేమని, బాధని పంచుకుంటాడు. ఆకాశంలో ఉండే ఒక మబ్బు ముక్క తన జీవితంలో అతి ముఖ్యమైన తోడుగా మారిపోతుంది. చివరికి ఆ మేఘం వల్ల మాణిక్ జీవితం పూర్తిగా మారిపోతుంది. లోకం తనని ఎలా చూసినా పట్టించుకోకుండా, ఆ ప్రకృతితో తను పొందే సంతోషమే నిజం అనుకుంటాడు. ఇది ఒక మనిషికి, ప్రకృతికి మధ్య ఉండే వింతైన ప్రేమని ఈ సినిమా చాలా సున్నితంగా చూపిస్తుంది.

Advertisement

Read Also :  మిస్సింగ్ కేసుతో మొదలయ్యే మర్డర్ కేసు… 2 గంటల పాటు సీట్ ఎడ్జ్ లో ఉంచే కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×