OTT Movie : కొన్ని హర్రర్ సినిమాలు పగలు చూసినా, రాత్రి చూసినా పెద్దగా తేడా ఏం ఉండదు. గుండె గభేల్ మనిపించే సీన్స్ తో వణుకు పుట్టిస్తుంటాయి. సినిమా అయిపోయిన తరువాత కూడా గజ గాజా వణికిపోతుంటారు. అటువంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒక జంట జరిపే తాంత్రిక శక్తి వల్ల, కొంత మంది మనుషులు ఆకల మరణం పొందుతారు. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో మొదలౌతుంది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
సోఫియా, ఎవా అనే ఇద్దరు టీనేజ్ సిస్టర్స్ ల జీవితం సరదాగా సాగిపోతుంటుంది. అయితే ఒక రోజు వీళ్ళ తల్లిదండ్రులు, ఒక గుహ దగ్గర భయంకరమైన కల్ట్ ఆచారంలో పాల్గొంటారు. దాని ఫలితంగా 23 మంది మరణించారని తెలుస్తుంది. ఆ మరణించిన వాళ్ళ ఒంటిమీద బట్టలు కూడా లేకుండా నగ్నంగా ఉంటారు. ఈ సంఘటన వల్ల వీళ్ళ జీవితాలు తలక్రిందులు అవుతాయి. ఆ గ్రామంలోని ప్రజలు వీళ్ళ తల్లిదండ్రులను దోషులుగా అనుమానిస్తుంటారు. దీంతో ఈ అక్కాచెల్లెళ్ళు సమాజంలో అనుమానాలను ఎదుర్కొంటారు. నిజానికి ఈ కల్ట్ ఆచారాన్ని, ఆ ప్రాంతంలో ఎప్పటినుంచో నిషేధించి ఉంటారు. ఆ ఊరికి దగ్గరలో ఒకప్పుడు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, సోఫియా తల్లిదండ్రులు తెలుసుకుంటారు.
నిద్రావస్థలో ఉన్న ఆ శక్తులను వీళ్ళు మళ్ళీ మేలుకొనేలా చేస్తారు. ఆ తరువాత ఈ గ్రామంలో వరుస మరణాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఈ సిస్టర్స్ తన తల్లిదండ్రుల గురించి రహస్యాలను, ఈ ఆచారం వెనుక ఉన్న వాస్తవాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. చివరికి ఈ అక్కాచెల్లెళ్ళు తన తల్లిదండ్రుల గురించి ఏం తెలుసుకుంటారు ? ఆ ప్రాంతంలో చేతబడి నిజంగానే జరిగిందా ? వీటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ స్పానిష్ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఫెరియా: ది డార్కెస్ట్ లైట్’ (Feria: The Darkest Light). దీనిని అగస్టిన్ మార్టినెజ్, కార్లోస్ మోంటెరోచే రూపొందించారు. ఈ సిరీస్ స్టోరీ స్పెయిన్‌లోని ఆండలూసియా అనే ఒక చిన్న పట్టణం ఫెరియాలో జరుగుతుంది. ఈ స్టోరీ ప్రధానంగా సోఫియా, ఎవా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు చుట్టూ తిరుగుతుంది. ఈ హారర్ సిరీస్ 2022 జనవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.