BigTV English

Sunita Williams : భూమి మీదకు ఎప్పుడొస్తామో తెలియదు – సునీత విలియమ్స్ సన్సెషనల్ కామెంట్స్

Sunita Williams : భూమి మీదకు ఎప్పుడొస్తామో తెలియదు – సునీత విలియమ్స్ సన్సెషనల్ కామెంట్స్

Sunita Williams : నెలల తరబడి అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్ లు తాము భూమి మీదకు ఎప్పుడొస్తామో స్పష్టత లేదన్నారు. 6 రోజుల ప్రయాణం కాస్తా తొమ్మిది నెలలు కావస్తున్నా.. తమకు ఎలాంటి ఆందోళనలు లేవన్నారు. అయితే.. తమ రాక ఆలస్యం అవుతున్న కొద్దీ.. దేశ ప్రజల్లో ఆందోళనలు, కలవర పాటు పెరిగిపోతుందని అంగీకరించారు. అనుకోని పరిస్థితుల్లో ఐఎస్ఐ లో చిక్కుకుపోయిన వారిని బైడెన్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న వ్యాఖ్యలపై ఇద్దరు వ్యోమగాలు స్పందించారు. అంతరిక్ష కేంద్రం నుంచే మీడియాతో మాట్లాడిన వ్యోమగాములు.. అనేక ఆసక్తికర అంశాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.


వివిధ అంశాలపై మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సునీతా విలియమ్స్, బుచ్మోర్ విల్మోర్ లు.. తాము భూమి మీదకు వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశం అని వ్యాఖ్యానించారు. నెలల తరబడి అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న ఈ వ్యోమగాముల్ని, బైడన్ పాలనలో పూర్తిగా వదిలేశారన్న వ్యాఖ్యలపై విల్మోర్ మాట్లాడారు. అవన్నీ రాజకీయ సంబంధమైనవని, వాటిపై స్పందించమని స్పష్టం చేశారు.
వారి సుదీర్ఘ అంతరిక్ష యాత్రను రాజకీయం చేసేందుకు ట్రంప్, మస్క్ చేసిన ప్రయత్నాలకు తెలిపిగా చెక్ పెట్టేశారు. అవన్నీ రాజకీయాల్లో భాగమని, అవి జీవితంలో ఓ భాగమన్నారు. వాటికి ఈ అంశంలో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తాను అభిప్రాయపడుతున్న విల్మోర్ తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపిన విల్మోర్.. మనందరికీ మిస్టర్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల అత్యంత గౌరవం ఉందన్న విల్మోర్.. మేము మా దేశానికి మద్దతు ఇస్తామని, మా దేశ నాయకులకు మద్దతు ఇస్తున్నాం, వారికి మేము కృతజ్ఞులం అంటూ.. వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం.. 2030 చివరి నాటికి కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ముందుగానే మూసివేయాలని మస్క్ ఇటీవల సూచించారు. దానిపై స్పందించిన విల్మోర్.. మస్క్ సూచనను తోసిపుచ్చారు. మనం ఇప్పుడు మన అత్యున్నత దశలో ఉన్నామని, ఇలాంటి సమయంలో మనం నినిష్క్రమించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.


జనవరిలో ట్రూత్ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలన.. ఐఎస్ఐ లో చిక్కుకున్న సునీత, విల్మోర్ లను విడిచిపెట్టిందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాల వల్ల వ్యోమగాములను అంతరిక్షంలో వదిలివేశారని మస్క్ సైతం పదేపదే ఆరోపించారు. ఫిబ్రవరిలో ట్విట్టర్ లో ఒక పోస్ట్‌ చేసిన మస్క్.. వ్యోమగాములను త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు తాను ముందుకు వచ్చానని వెల్లడించారు. కానీ.. బైడెన్ సర్కార్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదని అన్నారు. ఈ విమర్శలపై బైడెన్ హయాంలో నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన పామ్ మెల్‌రాయ్ స్పందించారు. నాసా ఉన్నతాధికారులకు మస్క్ నుంచి అలాంటి ఆఫర్ ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు.

Also Read : 19 Yrs Old Google Techie : స్కూల్ స్థాయిలోనే గూగుల్ ఉద్యోగం – అయినా వర్శిటీల్లో అడ్మిషన్లు రిజెక్ట్ – కోర్టుకెక్కిన యువకుడు

విల్మోర్, సునీత విలియమ్స్.. గతేడాది జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో వారు అంతరిక్ష ప్రయాణం చేయగా.. తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యల కారణంగా వీరి ప్రయాణం వాయిదా పడుతూ వస్తుంది. వాహనం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించడానికి సుమారు వారం రోజుల పాటు జరిగిన చర్చలు, సమావేశాల్లో స్టార్ లైనర్ సురక్షితం కాదని నిర్ణయించారు. దాంతో.. ఈ జంట అక్కడే ఉండిపోగా.. మార్చి రెండో వారంలో వారిని స్పేస్‌ఎక్స్ మిషన్‌లో భూమి మీదకు తీసుకురానున్నారు. అప్పటికి వీరు దాదాపు 10 నెలలు అంతరిక్షంలో గడిచిపోతున్నాయి.

Related News

Nobel Prize 2025 Medicine: రోగ నిరోధక వ్యవస్థపై ఆవిష్కరణలు.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

Big Stories

×