Game Changer.. ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కూడా నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆయన కూడా తన కలలో ఈ విషయాన్ని ఊహించి ఉండరని అభిమానులు సైతం కామెంట్లు వ చేస్తున్న విషయం తెలిసిందే. అలా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) తో కలిసి రామ్ చరణ్ చేసిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయి ఇమేజ్ను అందించింది . ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో కలిసి కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేశారు. కానీ ఈ సినిమా బెడిసి కొట్టింది. ఆ తర్వాత సోలో హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ విడుదలైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకొని, ఆ తర్వాత నెలలోపే ఓటీటీలోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Ajith – Dhanush: రేస్ నుండీ తప్పుకున్న ధనుష్.. వెనుకడుగు వేయడానికి కారణం..?
గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ కొత్త స్ట్రాటజీ..
అయితే ఇప్పుడు ఈ ఓటీటీ విషయంలో మరో ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా హిందీ హక్కుల విషయంలో మాత్రం కొత్త ట్విస్ట్ తాజాగా బయటకు వచ్చింది. సాధారణంగా ఓటీటీ హక్కులన్నీ ఒకే వేదిక దక్కించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను Zee 5 దక్కించుకోవడం గమనార్హం. అంటే సౌత్ భాషల్లో సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్, హిందీ భాషలో చూడాలంటే Zee5 సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇలా ఒక సినిమాను వివిధ భాషల్లో చూడడానికి వివిధ రకాల ఓటీటీ ప్లాట్ఫామ్ లను కొనుగోలు చేయాలా? అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇది తెలిసిన మరికొంతమంది ఇది ఓటీటీ బిజినెస్ లో కొత్త స్ట్రాటజీ కావచ్చు అంటూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ లో ఈ ఊహించిన ట్విస్ట్ అందరికీ భారీ షాక్ కలిగించిందని చెప్పవచ్చు.
కనీసం ఓటీటీలోనైనా రికార్డు సృష్టిస్తుందా..?
ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10 వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. థియేటర్లలో మంచి రీచ్ ఉంటుందని అందరూ అనుకున్నారు.కానీ మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..ఇకపోతే ఇందులో భారీతారాగణం ఉండడం వల్ల హిందీ మార్కెట్లో కూడా మంచి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమా పెద్ద ఎత్తున వసూలు రాబట్టకపోయినా.. కనీసం ఓటీటీలో ఈ సినిమాకు డిమాండ్ బాగా ఏర్పడిందని సమాచారం. మరి విభిన్నమైన ఓటీటీ వేదికలు సినిమాకు ఎలా సహాయపడతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.