E-Paper
Advertisement

WPL 2026 Auction: మెగా వేలంలో క‌ల‌క‌లం, గుజ‌రాత్ జ‌ట్టులోకి అనుష్క శ‌ర్మ‌…షాక్ లో విరాట్ కోహ్లీ

WPL 2026 Auction: మెగా వేలంలో క‌ల‌క‌లం, గుజ‌రాత్ జ‌ట్టులోకి అనుష్క శ‌ర్మ‌…షాక్ లో విరాట్ కోహ్లీ
Advertisement

WPL 2026 Auction:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 Auction) మెగా వేలం గురువారం చాలా గ్రాండ్ గా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 277 మంది స్టార్ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేవలం 73 స్థానాలకు గాను ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కొంతమంది ప్లేయర్లు భారీ ధర పలికితే, మరి కొంతమంది ప్లేయర్లు తక్కువ ధర పలికారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ వాళ్లు అన్ సోల్డ్ ప్లేయర్స్ గా మిగిలిపోయారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో అనుష్క శర్మ ( Anushka Sharma) పేరు తెరపైకి వచ్చింది. అనుష్క పేరుతో బిడ్డింగ్‌ కూడా జరిగింది. దీంతో అందరూ కోహ్లీ భార్య‌, హీరోయిన్‌ అనుష్క శర్మ వేలంలోకి రావడం ఏంటని షాక్ అయ్యారు. విరాట్ కోహ్లీ భార్య ఈ మెగా వేలంలోకి ఎందుకు వచ్చిందని కంగుతిన్నారు. అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోయారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలోకి అనుష్క శర్మ ( Anushka Sharma)

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలంలో ( WPL 2026 Auction) అనుష్క శర్మ పేరు నిజంగానే వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మాత్రం కాదు. ఈ వేలంలోకి వచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో అమ్మాయి. ఆమె పేరు కూడా అనుష్క శర్మనే. అనుష్క బ్రీజ్ మోహన్ శర్మ అనే పేరును సింపుల్ గా అనుష్క శర్మ అని పెట్టుకుంది. నిన్న జరిగిన వేలంలో పది లక్షల రూపాయలతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మను 45 లక్షల రూపాయలకు గుజరాత్ జెయింట్స్ జట్టు ( Gujarat Giants ) కొనుగోలు చేసింది. ఈ 22 ఏళ్ల అనుష్క శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగింది. ఈమె మంచి ఆల్రౌండర్. దేశీయ క్రికెట్ లో కూడా అద్భుతంగా రానిస్తోంది. మధ్యప్రదేశ్ మహిళల జట్టు, సెంట్రల్ జోన్ జట్ల తరఫున కూడా ఆడింది. ఈమెను ప్రతిసారి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా జట్లు వాడుకుంటున్నాయి. అయితే నిన్న జరిగిన మెగా వేలంలో ఈమె పేరు రావడంతో అందరూ విరాట్ కోహ్లీ భార్య అని అనుకున్నారు. అటు విరాట్ కోహ్లీ కూడా షాక్ అయినట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

WPL 2026 కోసం గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్

Gujarat: గార్డనర్, మూనీ, సోఫీ డివైన్, రేణుక, డాని వ్యాట్, భారతీ ఫుల్మాలి, టైటాస్ సాధు, కష్వీ గౌతమ్, కనికా అహుజా, తనూజా కన్వెర్, వేర్‌హామ్, అనుష్క శర్మ ( Anushka Sharma), హ్యాపీ కుమారి, గార్త్, యాస్తిక, శివాని సింగ్, రాజేశ్వరి & ఆయుషి సోనీ.

Advertisement

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

 

?igsh=cGFtb2I1ZDBpMXdo

 

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×