BigTV English

OTT Movie : ఇంట్లో ఒంటరిగా ఉండే భార్య… పట్టపగలే చుక్కలు చూపించే దెయ్యం… ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిస్తే దిమాక్ కరాబ్

OTT Movie : ఇంట్లో ఒంటరిగా ఉండే భార్య… పట్టపగలే చుక్కలు చూపించే దెయ్యం… ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిస్తే దిమాక్ కరాబ్

OTT Movie : ఒక ఈ బెంగాలీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమా హారర్ అంశాలతో పాటు  అతీంద్రియ సంఘటనలచుట్టూ తిరుగుతుంది. ఈ కథలోట్విస్ట్‌లు, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా ఊహించని క్లైమాక్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఫ్లాట్ నం. 609’ (Flat no 609) 2018లో విడుదలైన బెంగాలీ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనికి అరిందమ్ భట్టాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2018 ఆగస్టు 31న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అబీర్ చటర్జీ, తనుశ్రీ చక్రవర్తి, సౌమిత్ర చటర్జీ, మమతా శంకర్, రుద్రనీల్ ఘోష్, ఖరాజ్ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అరిందమ్ భట్టాచార్య దర్శకత్వం వహించారు. సౌవిక్ బసు సినిమాటోగ్రఫీ, హిండోలే చక్రవర్తి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమామరచిపోలేని ఒక హారర్ అనుభవాన్ని అందిస్తుంది.


స్టోరీలోకి వెళితే

కథ కోల్‌కతా సమీపంలోని రాజర్‌హట్ ప్రాంతంలో ఒక కొత్తగా పెళ్ళైన జంట అర్కో ముఖర్జీ (అబీర్ చటర్జీ), సాయంతనీ (తనుశ్రీ చక్రవర్తి) చుట్టూ తిరుగుతుంది. ఈ జంట ఒక సౌకర్యవంతమైన అపార్ట్‌మెంట్ కోసం వెతకడం మొదలు పెడతారు. ఈ సమయంలో బ్రోకర్ పప్పు (రుద్రనీల్ ఘోష్) సహాయంతో ఒక 3 BHK డూప్లెక్స్ ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకుంటారు. అయితే ఈ ఫ్లాట్‌కు కొన్ని వింత నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఒక లాక్ చేయబడిన స్టోర్‌రూమ్‌ను ఎప్పటికి తెరవకూడదనే షరతు ఉంటుంది. ఈ షరతులు పెద్ద సమస్య కాదని భావించి, ఈ జంట ఫ్లాట్‌లోకి మారతారు. వీళ్ళు ఫ్లాట్‌లోకి మారిన కొద్ది రోజుల్లోనే, సాయంతనీ అసాధారణ సంఘటనలను గమనిస్తుంది. ఫ్రేమ్‌లు గోడల నుండి పడిపోవడం, డ్రాయర్లు ఆటోమాటిగ్గా తెరుచుకోవడం, ఒక చిన్న పిల్లవాడి నీడ టీవిలో కనిపించడం వంటివి జరుగుతాయి. సాయంతనీ గతంలో తన బిడ్డని గర్భంలో కోల్పోవడం వల్ల మానసికంగా కృంగిపోయి, బైపోలార్ డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అనుభవాలు ఆమె మానసిక స్థితి వల్ల కలిగిన భ్రాంతులా లేక నిజమైన అతీంద్రియ సంఘటనలా అనే సందేహంలో ఉంటుంది.

Read Also : డిన్నర్ కి పిలిచి, దండం పెట్టినా వదలని డేంజర్ పిల్ల… మనుషులనే మటన్ లా పీక్కుతినే ఫ్యామిలీ… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి

అర్కో ఆమె చెప్పేవి భ్రమలుగా భావించి, ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఫ్లాట్ పక్కనే ఉండే వృద్ధ దంపతులు ఎందుకనో వింతగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఫ్లాట్ గురించి ఏవైనా సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. సాయంతనీ ఆ స్టోర్‌రూమ్‌ లో రహస్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె స్నేహితురాలు (పూజరినీ ఘోష్) కూడా ఆమె మాటలను నమ్మదు. అప్పుడు సాయంతనీ తన తండ్రికి సమాచారం ఇస్తుంది. అతను పోలీసుల సహాయం తీసుకుంటాడు. డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ నుండి ఒక సీనియర్ ఆఫీసర్ (ఖరాజ్ ముఖర్జీ) ఈ కేసును విచారించడానికి వస్తాడు. చివరగా వృద్ధ దంపతులు ఫ్లాట్ చీకటి చరిత్రను బయటికి చెప్తారు. ఇది కథలోని అసలు రహస్యాన్ని బయటపెడుతుంది. సాయంతనీ గతంతో కూడా ఈ ఇంటికి ముడిపడి ఉంటుంది. అర్కో ఆమెను ఈ సమస్యల నుండి ఎలా రక్షిస్తాడు ? ఆ గదిలో ఉన్న రహస్యం ఏమిటి ? నిజంగానే దయ్యాలు ఉన్నాయా ? అవి ఈ జంటను ఏం చేస్తాయి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×