Gundeninda GudiGantalu Today episode August 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న బయటకు వస్తాడంటూ పూజలు చేయాలని రోహిణిని బలవంతంగా గుడికి తీసుకొని వెళుతుంది అక్కడ వెళ్ళగానే స్నానం చేయించి, చేతిలో హారతి ఇవ్వమని చెప్తుంది. అంతే కాదు పూజారి చెప్పినట్టు అంగప్రదక్షిణాలు చేయాలి అనగానే రోహిణి షాక్ అవుతుంది. పాలు మాత్రం మొత్తము సిలిండర్ దొల్లినట్టు డోళ్ళాలి అదే అంగప్రదక్షిణ అని బాలు క్లారిటీగా చెప్తాడు. రోహిణి చేస్తుంటే మనోజ్ కి ఫోన్ వస్తుంది. మనోజు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. కల్పన అక్కడ మనోజ్ ని చూసి దాక్కుంటుంది.. మనోజు ఫోన్ మాట్లాడి వస్తుంటే బాలు వెళ్లిపోవడంతో బాలుని ఆపి ఏంట్రా నువ్వు ఉండట్లేదా? వెళ్ళిపోతున్నావా? అని అడుగుతాడు. ఏ నువ్వు గుడి బయట అడుక్కుంటావా ఏంటి అని బాలు అడుగుతాడు. ఇదంతా కాదురా నువ్వు లోపలికి వెళ్ళు రోహిణి అయిపోయింది ఇప్పుడు నువ్వే ప్రదక్షిణాలు చేయాలంట అని అంటాడు. బాలు కల్పనని తీసుకొని వెళ్లాలని కార్లో కూర్చుంటాడు.. అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే మీనా ముగ్గు వేయాలని బయటికి వెళ్తే.. ప్రభావతి బయట నిలబెట్టేస్తుంది ఆ విషయం తెలుసుకున్న బాలు ఏంటి మీనా ఇలా శిల్పం లాగా నిలబడ్డావు అని అడుగుతాడు. శిల్పం లాగా కాదండి మీ అమ్మగారు నన్ను ఇక్కడే నిలబడమని చెప్పారు అందుకే నేను ఇక్కడే నిలబడ్డానని అంటుంది. ఇది ఒక కొత్త పనిష్మెంట్ నా.. అదే చెప్తున్నాను అప్పుడు అక్కడికి వచ్చిన సత్యంతో బాలు చూసారా నాన్న మీ ఆవిడ మా ఆవిడని ఇక్కడ నిలబెట్టింది అని అంటాడు. ఇంట్లో నుంచి బలవంతంగా ప్రభావతి బయటకు తీసుకొని వస్తుంది. ఆలు పాలనమ్మ అంత పెద్ద తప్పు ఏమి చేసింది నువ్వు బయటికి గెంటేస్తున్నావ్ అని అడుగుతాడు. రోహిణి ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది.
రోహిణిని తీసుకురావడం చూసి బాలు షాక్ అవుతున్నాడు. ఇంట్లోంచి గెంటేస్తున్నట్లు అలా ఉన్నావేంటి అని ప్రభావతిని అడుగుతాడు.. ఈ పూజ అయిపోయేంతవరకు ప్రతిరోజు రోహిణి ముగ్గు వేయాలని కండిషన్ పెడుతుంది ప్రభావతి.. ఇన్ని రోజులు నువ్వు పెట్టే ముగ్గు ఎవరికి నచ్చలేదు ఇప్పుడు ఈవిడ పెడుతుందిలే అని బాలు సెటైర్లు మీద సెటైర్లు వేస్తాడు. పోనీలే రోహిణి ఈరోజు నేను వేస్తాను అని ఎంత చెబుతున్నా సరే మీనాని రోహిణి వద్దని అంటుంది.
అటు ప్రభావతి కూడా ఏది ఏమైనా సరే రోహిణినే ముగ్గు పెట్టాలని కచ్చితంగా చెప్పేస్తుంది.. రోహిణి ఏదో ఒక విధంగా ముగ్గుని పూర్తి చేస్తుంది. ఇది చూసిన బాలు సాలి పురుగు గూడు కట్టినట్లుంది బయటికి వెళ్తే నా బండి కూడా ఇలా వంకర టింకర్లు వెళ్తుందో ఏంటో భయమేస్తుంది అని అంటాడు. మీనా సత్యంను లోపలికి వెళ్ళమని చెప్తాడు. ఇక అందరూ టిఫిన్ చేసే దానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. శృతి రవి పూరి కుర్మ గురించి గొప్పగా పొగుడుతారు. అయిన తర్వాతే ఇలాంటివి చేయడం అని రవి కూడా పొగడటంతో శృతి నిజమే అని అంటుంది.
ఆ మాటలు విన్న ప్రభావతి కుళ్ళుకుంటుంది.. ఈ మాట కనుక బాలు చెవిని పడితే మళ్లీ ఇంటి ముందు టిఫిన్ సెంటర్ పెట్టిస్తాడు.. ఒకవైపు ఇంటింటికి వెళ్లి పూలు అమ్ముకుంటూ మరో వైపు పూరి చేసుకుంటూ ఉంటుంది అని ప్రభావతి అవమానిస్తుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం పూరి కుర్మ చాలా బాగుంది అంటూ తింటాడు. బాలు వీధి చివరి వరకు ఈ వాసన వస్తుంది అని తినబోతుంటే ప్రభావతి ప్లేట్లో పూరీలను తీసి పక్కన పెడుతుంది.. మొత్తం నువ్వే తింటే మిగతా వాళ్ళది ఏం తింటారు ఒకటి తిను బయట ఏదైనా బండిమీద తింటావు కదా అని అంటుంది.
నాకు కడుపు మార్చి వాళ్లకి పెట్టాలని చూస్తావా చెప్తాను వాళ్ళు రాని అని బాలు అంటాడు. మనోజ్ రోహిణి ఇద్దరు రాగానే పూరీ చాలా బాగుంది అని ప్లేట్లో పెట్టుకుంటారు. బాలు పూజ చేస్తూ ఉప్పు కారం ఉన్న కూరని తింటే అపచారం అని అంటాడు.. పూజలో ఉన్న వాళ్ళు స్వయంపాకం చేసుకుని తినాలి ఇది కూడా మర్చిపోతే ఎలా అని బాలు కావాలనే గుర్తు చేస్తాడు.. ఆ తర్వాత మనోజ్ తినబోతుంటే భార్య బాధల్ని సగం పంచుకోవాలని నువ్వు కూడా భార్య ఏది చేస్తే అదే తినాలి అని అంటాడు. పూరీలను బాలు తింటాడు..
Also Read: గురువారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…
బాలు టిఫిన్ చేస్తుండగా ఫారిన్ ఆవిడ ఫోన్ చేస్తుంది.. ఎవర్రా ఈ ఫారిన్ ఆవిడ అని అంటాడు సత్యం. ఈమె నా కస్టమర్ నాన్న సారీ నుంచి వచ్చింది అని బాలు అంటాడు. ఇక బాలు టిఫిన్ చేసి కల్పన దగ్గరికి వెళ్తాడు. కల్పనను తీసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే టికెట్ గురించి మాట్లాడుతుంది కల్పనా. మీకోసం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అతని పేరు మనోజ్ అని అక్కడ ఉన్న ఆవిడ చెప్పడంతో కల్పనా షాక్ అవుతుంది. మనోజ్ కి పెళ్లి అయిపోయింది అన్నమాట నాకోసం వెతుక్కుంటూ వచ్చారంటే నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…