OTT Movie : సస్పెన్స్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ జానర్ లో వస్తున్న వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ థ్రిల్లింగ్, ట్విస్ట్‌లు, బో*ల్డ్ స్టోరీతో సోషల్ మీడియాలో కూడా బజ్ సృష్టించింది. ఈ సిరీస్ ట్రయాంగిల్ లవ్ తో ప్రేక్షకులకు ఒక సస్పెన్స్‌ఫుల్ రైడ్‌ను ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఉల్లూలో స్ట్రీమింగ్
‘చెహ్రా’ (Chehraa) 2024లో విడుదలైన హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది హిమాన్షు బ్రహ్మభట్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సిమ్రాన్ కపూర్, వివాన్ శ్రీవాస్తవ, దిరాజ్ అల్వానీ, ప్రీతి డే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రాహుల్ అనే వ్యక్తి జీవితంలోకి ప్రవేశించే ప్రీతి, ఆమె ద్వారా బయటపడే రహస్యాల చుట్టూ తిరుగుతుంది. ఉల్లూ (Ullu) ప్లాట్ ఫామ్‌లో ఇది అందుబాటులో ఉంది. మొదటి భాగంలో 4 ఎపిసోడ్‌లు, సుమారు ఒక్కోటి 75 నిమిషాలు ఉంటుంది. రెండవ భాగం (చెహ్రా పార్ట్ 2) ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
రాహుల్ అనే బాస్‌కి, సోనాలి అనే ఎంప్లాయీతో లవ్ స్టోరీ మొదలవుతుంది. సోనాలి భర్త కూడా అతని కిందే పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక ఊహించని షాక్ తగులుతుంది. ఈ విషయం ఒక రోజు ఆమె భర్తకి తెలుస్తుంది. అయినా రాహుల్ ఆమెపై ప్రేమను కొనసాగిస్తాడు. ఇంతలో ప్రీతి అనే అమ్మాయి రాహుల్ జీవితంలోకి భార్యగా నటిస్తూ వస్తుంది. ప్రీతి వచ్చాక, రాహుల్ గతంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ రహస్యాలు ప్రీతి, మోహిత్ అనే మరో పాత్రలతో లింక్ అవుతాయి, వీళ్లిద్దరూ రాహుల్‌కి వ్యతిరేకంగా బెట్రాయల్ ప్లాన్ చేస్తారు.
Read Also : రాత్రిపూట మాత్రమే డ్యూటీ చేసే పోలీస్… లేడీ యాక్టివిస్ట్ ఎంట్రీతో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్