Gundeninda GudiGantalu Today episode july 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా పూలు ఇవ్వాలని బయటకు వెళ్తుంది. ప్రభావతి ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. వేరే వాళ్లకు పూలు ఇవ్వాల్సింది ఉంది ఇచ్చేసి వస్తాను అని అంటుంది.. ఫ్రిజ్లో ఉండాల్సిన కూరగాయలు బయటపెట్టి పువ్వులని ఫ్రిజ్ నిండా నింపేస్తావా అని ప్రభావతి అడుగుతుంది. వాడి పోకూడదు కదా అత్తయ్య అందుకే అక్కడ పెట్టాను అని మీనా అంటుంది.. నేను బయటికి వెళ్లి వస్తాను మీరు వంట చూస్తూ ఉండండి అని చెప్పి నేను బయటకి వెళ్ళిపోతుంది మీనా..
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది. పూలు ఆర్డర్ ఇచ్చారు ఒక నలుగురికి పువ్వులు ఇచ్చి రావాలి అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి శృతి వాళ్ళమ్మ శోభ వస్తుంది. మీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా అని ప్రభావతి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఇటు వెళ్తున్నాను ఒకసారి చూసి వెళదామని వచ్చాను అని శోభ అంటుంది. శోభా ప్రభావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆవిడ పులమ్మాయి అని గట్టిగా అరుస్తుంది. మీనా లేదు బయటికి వెళ్ళింది మళ్లీ రేపు అని అరుస్తుంది. మీన లేకుంటే మీరు ఉన్నారు కదా మీరు ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. ప్రభావతి అమ్మాయికి అడిగినట్లుగా పూలు ఇస్తుంది.. శోభ కూడా పూలు ఇవ్వండి అని అడిగి అవమానిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ఈ పూల కొట్టు నువ్వు తీసేసి ఒక ఐడియా నా దగ్గర ఉంది ఆంటీ అని అంటుంది. ఏంటమ్మా ఐడియా ని ప్రభావతి అడుగుతుంది. కార్పొరేషన్ వాల్ల పర్మిషన్ తీసుకోవాలి. వీళ్లు తీసుకోలేదనుకుంటా మనము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ షాప్ ని తీసేస్తారు అని అంటుంది. అది విన్న ప్రభావతి సంతోషపడుతుంది. పూల కొట్టు పోతుంది మీనా నా గుప్పెట్లో ఉంటుంది అని కలలు కంటుంది.. మీనా నీకు ఇక ముందు ఉంటుంది. అప్పుల కొట్టు చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. దాన్నే లేకుండా చేసేస్తా అని ప్రభావతి సంతోషపడుతుంది..
ఉదయం లేవగానే ప్రభావతి రోహిణి తిడుతుంది.. ఆ కామాక్షికి పోయి చెప్పావా.. కాకి వాలినంత ఈజీగా వచ్చి వాలిపోయి మనకి కావాల్సినంత పెడుతుంది ఎందుకు చెప్పావు రోహిణి అని ప్రభావతి అరుస్తుంది. ఆ మాట వినగానే కామాక్షి వెంటనే వచ్చి వాలిపోతుంది. వదిన ఏంటి నేను విన్నది నిజమేనా..? నువ్వు పూలు అమ్మవా? బాలు లాగా ఈ వీధులు అందరిని నువ్వు పూలావతి అని అంటున్నారంటగా.. నువ్వు పూలన్నా మీ నాకు సాయంగా ఉండు. నేనంటే చీటీలు ఉన్నాయి కాబట్టి అది చేస్తుంటాను.
నువ్వేమీ ఖాళీగా ఉన్నావ్ కదా తిని గుండ్రాయిలాగా ఉన్నావు ఈ పని చేస్తే కాస్త నాజుగ్గా తయారవుతావు అని కామాక్షి మాటలతోనే ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది. మీనా పూల కొట్టు కచ్చితంగా లేచిపోతుంది చూడు అని ప్రభావతి శాపం పెడుతుంది. ప్రభావతి అన్న వెంటనే కార్పొరేషన్ వాళ్లు వచ్చి ఆ షాపింగ్ తీయడానికి రెడీ చేస్తుంటారు. వెంటనే రోహిణి అత్తయ్య మీనా షాపు తీయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు చూద్దాం రండి అని అంటుంది. చూసావా నా నోరు కి ఎంత పవర్ ఉందో.. మీనా షాపు వెళ్ళిపోతుంది అని ప్రభావతి అంటుంది.
కామాక్షి అంతా పవరే ఉంటే మనోజ్ బాగుపడాలని అంటే సరిపోతుంది కదా ఏమైందో చూద్దాం పద అని అంటుంది. అయితే ప్రభావతి రోహిణి ఇద్దరు బయటికి వెళ్లి చూస్తుంటారు.. కామాక్షి మాత్రం అక్కడికి వచ్చి ఎవరండీ మీరు.. కామాక్షి ఎంత చెప్తున్నా వినకుండా ఈ షాప్ ని తీసేయడానికి వచ్చామండి అని అంటారు. మాట వినగానే ప్రభావతి రోహిణి సంతోష పడుతూ ఉంటారు. కామాక్షి ఎంత అడుగుతున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా షాపును తీసే ప్రయత్నం చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం మీనా ఇద్దరు కూడా షాప్ ఎవరికి అడ్డం వచ్చిందండి ఇది మా ఇంటి దగ్గర ఉందని అడుగుతారు.
కానీ వాళ్లు మాత్రం అస్సలు వినిపించుకోకుండా షాపింగ్ తీసుకుని వెళ్ళిపోతారు. మావయ్య గారు ఈ షాప్ వల్ల నేను అప్పు చేసానండి. ఇప్పుడు షాప్ లేకపోతే వాళ్ళు వచ్చి నా మీద పడతారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మీనా. ఇక మీనా బాలు కి ఫోన్ చేసి విషయాన్ని చెప్తుంది. వెంటనే అక్కడికి వచ్చిన బాలు ఇది ఎవరో కావాలని చేసినట్టున్నారు నేను చెప్తాను నువ్వేం బాధపడకు మీనా అని ఓదారుస్తాడు. కామాక్షి మంత్రం వాళ్ళు ఎవరో కావాలని చేశారనుకుంటారా అందుకే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి అని అంటుంది.
Also Read : ఆ పని చేసి అన్నయ్యను చదివించా.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టోరీ..
కానీ ప్రభావతి మాత్రం కామాక్షిని ఆపుతూ ఉంటుంది. కొట్టు ఇంటి దగ్గర ఉంటే ఎవరు పరువు పోయింది ఆ మనోజ్ గాడు ఆడుకోవడం మా చీటీ పట్టుకొచ్చే వాళ్ళందరూ చూశారు నాతో అన్నారు కూడా అని అంటుంది. నువ్వేం బాధపడకు మీనా ? నీ పూలు కొట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తుందిలే అని కామాక్షి వెళ్లిపోతుంది.. కానీ మీనా మాత్రం బాధ పడుతూనే ఉంటుంది. మా హోటల్ నాకు చాలా బాధగా ఉంది అని బాలుతో అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు మీనా కి స్కూటీ మీద పూలను అమ్మేందుకు కొనాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..