E-Paper

Virender Sehwag: రాసి పెట్టుకోండి..మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం

Virender Sehwag: రాసి పెట్టుకోండి..మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం
Advertisement

Virender Sehwag:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా.. 64 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించి… టి20 ప్రపంచ కప్ టోర్నమెంటులో శుభారంభం అందుకుంది. దీంతో టీమ్ ఇండియా ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, పాకిస్తాన్ పైన గెలిచిన టీమిండియాను మెచ్చుకుంటూ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన మహిళల జట్టు గెలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదే మహిళల టీమిండియా జట్టు… పురుషుల పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడిస్తుందని చాలెంజ్ విసిరారు. అలా ఓడించకపోతే… తన పేరు మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం – వీరేంద్ర సెహ్వాగ్

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (ICC Women’s T20 World Cup 2026 Tournament) పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించడం పట్ల వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మ్యాచ్ లోను పాకిస్తాన్ జట్టును చిత్తు చిత్తుగా టీమిండియా ఓడిస్తూ వస్తోందన్నారు. ఇదే మహిళల జట్టు.. పాకిస్తాన్ పురుషుల జట్టును కూడా ఓడించగలరని సంచలన ప్రకటన చేశారు. అలా ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని చాలెంజ్ విసిరారు. పురుషుల పాకిస్తాన్ జట్టు కంటే ప్రమాదకరంగా మహిళల టీం ఇండియా జట్టు ఆడుతోందని ప్రశంసించారు. ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ వర్మ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారని… మంచి భాగస్వామ్యం నెలకొల్పితే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదన్నారు.

షెఫాలీ వర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు. జెమీమా టచ్ లోకి వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వన్డేల తరహాలో కాకుండా కాస్త దూకుడుగా ఆడాలన్నారు. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ కూడా దుమ్ము లేపుతుందని.. మిడిల్ ఆర్డర్ ను ఆమె చాలా చక్కగా ముందుకు తీసుకు వెళుతుందని ప్రశంసించారు వీరేంద్ర సెహ్వాగ్. ఇక చివరిలో మహేంద్రసింగ్ ధోనీ లాగా రీచా ఘోష్ తడాఖా చూపిస్తూ టీమ్ ఇండియాకు కీలక పరుగులు అందిస్తోందని వెల్లడించారు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా దీప్తి శర్మ అద్భుతంగా రాణిస్తుందని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా టీమిండియా కు మంచి పరిణామం అన్నారు. పాకిస్తాన్ పైన ఆడినట్లుగానే దూకుడుగా ముందుకు వెళితే… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలవడం చాలా సులువు అన్నారు వీరేంద్ర సెహ్వాగ్.

Advertisement

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

 

Related News

ఇండియాతో మ్యాచ్ అంటే, అర్థ‌రాత్రి కూడా పాక్ ప్లేయ‌ర్లు ఉలిక్కిప‌డేలా చేయాలి

పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Shahid Afridi: స్మృతి, రీచా ఘోష్ బ్యాట్ల‌ల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయింది

ఒక్క మ్యాచ్ కే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో టీమిండియాను ఓడిస్తాం

Cooper Gifts Bike to Litton Das: కూపర్ గొప్ప మ‌న‌సు..లిట‌న్ దాస్ కు బైక్ గిఫ్ట్

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

×