BigTV English
Advertisement

Garudan Movie : అమ్మాయిలనే టార్గెట్ చేసే సైకో… మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్

Garudan Movie : అమ్మాయిలనే టార్గెట్ చేసే సైకో… మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్

Garudan Movie : మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. గ్రిప్పింగ్ కథలతో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ, ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా స్టోరీ ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎవరు చేశారనేది చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గరుడన్’ (Garudan). 2023 లో విడుదలైన ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి అరుణ్ వర్మ దర్శకత్వం వహించగా, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఒక క్రిమినల్ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసి, తెలివిగా తప్పించు కుంటూ ఉంటాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

సలాం అనే వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్లో, ఫ్రెండ్స్ తో కలసి మద్యం సేవిస్తూ ఉంటాడు. అందులోనే పనిచేసే సలాం కి ఒక వ్యక్తి పారిపోతున్నట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూడగా, ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అప్పటికే ఆమెపై అఘాయిత్యం జరిగి ఉంటుంది. పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తాడు సలాం. ఆ అమ్మాయిని హాస్పిటల్ కి చికిత్స కోసం పంపిస్తారు పోలీసులు. అప్పటికే ఆ అమ్మాయి కోమాలోకి వెళ్లిపోయి ఉంటుంది. ఈ కేసును డిసిపి హరీష్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ అమ్మాయి దగ్గర దొరికిన డిఎన్ఏ రిపోర్టు వచ్చాక, ఎవిడెన్స్ కోసం అన్ని ల్యాబ్ లకు పంపిస్తాడు. చివరికి ఆ డిఎన్ఏ నిశాంత్ వ్యక్తి డిఎన్ఏ తో సరిపోతుంది. నిశాంత్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు డిసిపి. ఆ తర్వాత కోర్టులో కూడా నిశాంత్ కి వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుంది. ఇలా అతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు.

ఆ తర్వాత నిశాంత్ జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. బెయిల్ మీద బయటకు వచ్చి, కేసును మళ్లీ రీఓపెన్ చేపిస్తాడు నిశాంత్. అప్పటికే జైల్లో తన లాయర్ డిగ్రీ పూర్తి చేస్తాడు నిశాంత్. తన కేసును హరీష్ కి వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేస్తాడు నిశాంత్. తనను అనవసరంగా ఇరికించారని, జడ్జికి చెప్తూ ఈ కేసును తానే వాదించుకుంటానని చెప్తాడు. జడ్జి కూడా అందుకు సరేనని ఒప్పుకుంటాడు. ఈ కేసులో డిసిపి కి వ్యతిరేకంగా సాక్షాలు సంపాదిస్తాడు నిశాంత్. రిటైర్డ్ అవుతున్న హరీష్, నిశాంత్ ఒక క్రిమినల్ గానే గుర్తిస్తూ ఉంటాడు. అతన్ని ఎలాగైనా మళ్ళీ జైలుకు పంపాలని అనుకుంటాడు. చివరికి వీళ్ళిద్దరి పోరాటంలో ఎవరు గెలుస్తారు? నిశాంత్ దుర్మార్గుడా? డిసిపి ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ ‘గరుడన్’ (Garudan) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×