BigTV English

OTT Movie : కుళ్లిపోయిన శవాలు… పోలీసే హంతకుడిగా మారితే… నరాలు కట్ అయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : కుళ్లిపోయిన శవాలు… పోలీసే హంతకుడిగా మారితే… నరాలు కట్ అయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ కోసం ఓటీటీలో సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. థ్రిల్లర్ సినిమాలలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే స్పెషాలిటీ వేరు. సీను సీనుకో ట్విస్ట్ తో అదరగొడతాయి. అందుకే ఇలాంటి సినిమాలంటే బాగా ఇష్టపడతారు చాలామంది. ఇక అందులోనూ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఈరోజు మనం చెప్పుకుంటున్నది కూడా అలాంటి ఓ క్రేజీ మలయాళ సినిమా గురించే. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
పీటర్ కురిషింగల్ (సురాజ్ వెంజరమూడు) ఒక సీఐ. పోలీసులంటే మొరటుగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాము సినిమాల్లో. కానీ ఇతను తన కేసులను బుద్ధితో పరిష్కరించడానికి ఇష్టపడే సైలెంట్ అధికారి. అతని భార్య చనిపోతుంది. తన తల్లి, కుమారుడు సెబిన్‌తో కలిసి జీవిస్తాడు పీటర్. ఈ నేపథ్యంలోనే కేరళలోని ఒక అడవిలో NCC క్యాంప్ సమయంలో రెండు క్యాడెట్‌ లు కుళ్ళిపోయిన శవాన్ని కనుగొంటారు. ఇది ఒక సంచలనాత్మక హత్య కేసుగా మారుతుంది. ఈ కేసును పీటర్‌ కు అప్పగిస్తారు పైఅధికారులు. కానీ ఈ హత్యలు అతని వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అతని కుమారుడు సెబిన్ కూడా ఈ కేసులో బలైపోతాడు.

కేసు మొదట డివైఎస్పీ బిజోయ్ కురువిల్లా (సుదీష్ నాయర్) నేతృత్వంలో విచారణ జరుగుతుంది. వాళ్ళేమో దీనిని దొంగతనం కోసం జరిగిన హత్యగా భావిస్తారు. కానీ పీటర్ తన కుమారుడు సెబిన్‌ తో సహా మాథ్యూ అనే వ్యక్తి కుటుంబం హత్యకు గురైన సంఘటనపై సంతృప్తి చెందడు. ఓవైపు బిజోయ్ టీం ఇన్వెస్టిగేట్ చేస్తుంటే, మరోవైపు అదే టైమ్ లో తాను కూడా సేమ్ కేసుపై విచారణ చేయడానికి అనుమతి తీసుకుంటాడు పీటర్.


పీటర్ తన విచారణలో మాథ్యూ కుటుంబ హత్యల వెనుక ఫాబియన్ జాన్ అనే వ్యక్తి ఉన్నాడని కనుగొంటాడు. ఫాబియన్ డైమండ్ స్మగ్లింగ్‌లో ఉంటాడు. మరి స్మగ్లర్ కు పీటర్ కొడుకుకు ఉన్న లింకు ఏంటి? అతను సెబిన్ ను, మాథ్యూ కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడు? ఈ స్మగ్లరే హత్య చేశాడని తెలుసుకున్న పోలీస్ పీటర్, తన కొడుకు హత్యకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? చివరికి పీటర్ పోలీసులకు దొరికాడా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాపై ఓ లుక్కేయండి.

Read Also : రెట్రో మూవీ రివ్యూ : ఇదో హింసాత్మక లవ్ వార్

ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘హెవెన్’ (Heaven). 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకు గోవింద్‌రాజ్ దర్శకత్వం వహించారు. సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించారు. న్యాయం, ప్రతీకారం మధ్యలో ఉండే సన్నని గీత ఏంటో సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. హానెస్ట్ గా ఉండే ఒక సామాన్య పోలీసు అధికారి తనకు జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకున్నాడో చూసి తీరాల్సిందే. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×