Cyber Crime Thriller: ఆన్‌లైన్ స్కామర్లను హ్యాక్ చేసి వాళ్లనే ఆటపట్టించడం ఈ కుర్రాళ్లకు సరదా. కానీ ఓ రోజు అదే టాలెంట్‌తో ఏకంగా ఓ క్రిప్టో బిలియనీర్‌ను టార్గెట్ చేస్తే? కోట్ల విలువైన క్రిప్టోను కొట్టేసిన తర్వాత అసలు గేమ్ మొదలైతే? స్క్రీన్ మీదే కథ మొత్తం సాగుతూ, ఒక్కో క్లిక్‌తో టెన్షన్ పెంచే సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘LifeHack’. జార్జీ ఫార్మర్, యాస్మిన్ ఫిన్నీ, రోమన్ హేయక్-గ్రీన్, జేమ్స్ స్కోల్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కైల్, అతడి ముగ్గురు ఫ్రెండ్స్ ఆన్‌లైన్ స్కామర్లను హ్యాక్ చేస్తూ డిజిటల్ ప్రపంచంలో రచ్చ చేస్తుంటారు. మరింత పెద్ద ఛాలెంజ్ కావాలనుకున్న కైల్, టెక్ బిలియనీర్ డాన్ హర్డ్ క్రిప్టో వాలెట్‌ను టార్గెట్ చేస్తాడు. మొదట ప్లాన్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. కానీ బిలియనీర్ కూతురు లిండ్సే రంగంలోకి దిగడంతో నలుగురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. ఈ బ్రిటిష్ స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్‌లో హ్యాకింగ్, క్రిప్టో, బ్లాక్‌మెయిల్, రియల్ వరల్డ్ హీస్ట్ ఎలిమెంట్స్ చూసే వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి.
కైల్, అలెక్స్, సిడ్, పీటీ నలుగురూ గేమింగ్, హ్యాకింగ్, ఆన్‌లైన్ ప్రాంక్స్‌లో మునిగిపోయే కుర్రాళ్లు. స్కామర్ల సిస్టమ్స్‌లోకి దూరి వాళ్లనే మోసం చేయడం వీళ్లకు ఎంటర్‌టైన్‌మెంట్. కానీ కైల్‌కు ఇంకా పెద్ద హిట్ కావాలి. అందుకే టెక్ బిలియనీర్ డాన్ హర్డ్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అతడి కూతురు లిండ్సే సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారాన్ని ఉపయోగించి బిలియనీర్ క్రిప్టో వాలెట్‌కి చేరుకుంటారు.
ప్లాన్ సక్సెస్ అయి క్రిప్టోను కొట్టేసిన తర్వాత తమకు ఎదురులేదని నలుగురూ అనుకుంటారు. కానీ లిండ్సే వాళ్లను కనిపెట్టి, పోలీసులకు అప్పగించకుండా ఓ షాకింగ్ డీల్ పెడుతుంది. తన తండ్రి దగ్గర ఉన్న సంపదను దొంగిలించాల్సిందేనని అల్టిమేటం ఇస్తుంది. దీంతో ఇప్పటివరకు కంప్యూటర్ స్క్రీన్ వెనుక సేఫ్‌గా ఉన్న ఈ హ్యాకర్లు నిజ జీవితంలోకి దిగాల్సి వస్తుంది. సైబర్ గేమ్ కాస్తా ప్రాణాలకు తెగించే హీస్ట్‌గా మారుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతున్న కొద్దీ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి. మరి ఆ కుర్రాళ్లు నిజంగా క్రిప్టో కొట్టేశారా? లిండ్సే వాళ్లను ఎందుకు బ్లాక్‌మెయిల్ చేసింది? స్క్రీన్ వెనుక మొదలైన గేమ్ చివరికి ప్రాణాల మీదకు ఎలా వచ్చింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
రొనాన్ కొరిగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జార్జీ ఫార్మర్, యాస్మిన్ ఫిన్నీ, రోమన్ హేయక్-గ్రీన్, జేమ్స్ స్కోల్జ్, జెస్సికా రేనాల్డ్స్, చార్లీ క్రీడ్-మైల్స్ తదితరులు నటించారు. Netflixలో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కంప్యూటర్ స్క్రీన్ మీదే కథను నడిపిస్తూ హ్యాకింగ్, క్రిప్టో హీస్ట్, బ్లాక్‌మెయిల్‌తో టెన్షన్ పెంచే సినిమాలు ఇష్టపడేవారికి ‘LifeHack’ డిఫరెంట్ సైబర్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.
Read Also: వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్