Political Action Thriller: యూరప్ లో నార్మల్ హైజాకింగ్ ఘటనలా కనిపించిన సంఘటనే ఓ భయంకరమైన బయోలాజికల్ అటాక్ కు ప్లాన్ అయితే ? ఓ వైపు విమానం, మరోవైపు ప్రాణాంతక వైరస్… సమయం గడిచేకొద్దీ ప్రమాదం పెరుగుతుంటే ఇద్దరు MI6 ఏజెంట్లు ఏం చేస్తారు ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘అపోలో హ్యాస్ ఫాలెన్’ (Apollo Has Fallen)ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? తెలుగులో ఉందా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
జారా టేలర్, విన్సెంట్ తలేబ్ ఇద్దరూ ఎంఐ6 ఏజెంట్లు. ఒక హైజాకింగ్ ఘటనతో వాళ్ల దర్యాప్తు మొదలవుతుంది. మొదట చూస్తే ఇది సాధారణ ఉగ్రవాద చర్యలా అనిపిస్తుంది. కానీ కేసును లోతుగా పరిశీలించిన కొద్దీ దాని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది. హైజాకింగ్ అసలు లక్ష్యం విమానాన్ని స్వాధీనం చేసుకోవడం కాదని, యూరప్ మొత్తాన్ని డేంజర్ లో పడేసే వైరస్ ను వ్యాప్తి చేయడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశమని అనుమానాలు మొదలవుతాయి. విషయం అర్థమయ్యే సమయానికి పరిస్థితి అదుపు తప్పే దశకు చేరుకుంటుంది.
జారా, విన్సెంట్ కలిసి ఆ కుట్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి అడుగులోనూ వాళ్లకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు ? ఎవరు కుట్రలో అసలైన భాగస్వాములు ? అనే అనుమానాలు వాళ్లను వెంటాడుతుంటాయి. సమయం మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదు. వైరస్ వ్యాప్తి చెందితే దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు, ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య సమన్వయ సమస్యలు కథను ట్విస్టులతో కీలక మలుపు తిప్పుతాయి.
ఒక చిన్న ఘటన వెనుక దాగి ఉన్న అంతర్జాతీయ స్థాయి కుట్రను బయట పెట్టడానికి ఏజెంట్లు చేసే ప్రయత్నమే కథకు ప్రధాన బలం. యాక్షన్ సన్నివేశాలతో పాటు గూఢచర్యం, బయోలాజికల్ థ్రెట్, రాజకీయ కుట్రలను కలిపి సిరీస్ ను నడిపించారు. మరి చివరికి ఆ ఏజెంట్లు కుట్రను ఎలా భగ్నం చేశారు ? ఆ కుట్ర చేసింది ఎవరు ? అందులో ఎవరి హస్తం ఉంది ? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడండి.
రిటూ ఆర్య (Ritu Arya), తెఫిక్ జల్లాబ్ (Tewfik Jallab), రిచర్డ్ డార్మర్, షార్లెట్ స్పెన్సర్ తదితరులు నటించిన యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అపోలో హ్యాస్ ఫాలెన్’ . సెప్టెంబర్ 18 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో హిందీ, ఇంగ్లిష్ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు ఆడియో మాత్రం లేదు. భాష అడ్డు కాదు అనుకుంటే ఈ సిరీస్ ను ఇంగ్షీషులోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.
Read Also: ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే