Nani Wife Anjana: నాచురల్ స్టార్ నాని ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎన్నో అవమానాలను ఇబ్బందులను దాటుకుంటూ నాని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మరికొన్ని గంటలలో నాని(Nani) నటించిన ది ప్యారడైజ్(The Paradise) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నాని భార్య అంజన(Anjana) ఇంస్టాగ్రామ్ వేదికగా నాని సినీ జర్నీ గురించి ఆయన పడిన ఇబ్బందులు గురించి తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే నాని సినీ జర్నీ గురించి అంజనా తెలియజేస్తూ.. నాకు ఇప్పటికి బాగా గుర్తుంది 2009లో నీ సినిమా చూడటం కోసం మేమంతా కలిసి కాలేజీకి కూడా వెళ్లకుండా థియేటర్ కు వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళాక మీ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ కనీసం మార్నింగ్ షో కూడా పడలేదనే విషయం తెలిసింది. ఒక కొత్త హీరో సినిమా సరైన సమయంలో థియేటర్లలోకి తీసుకురావడం ఎంత కష్టమో ఆ క్షణమే నాకు అర్థమైంది.
ఈ 16 సంవత్సరాల తర్వాత పరిస్థితిలు పూర్తిగా మారిపోయాయి. కేవలం నీ పేరు మీద ఉన్న నమ్మకంతోనే ది ప్యారడైజ్ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఒక్కో సినిమా ద్వారా నువ్వు సంపాదించుకున్న ఈ నమ్మకం చూస్తుంటే చాలా గర్భంగా ఉంది. ఈ అందమైన రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించింది కాదు. మీ ఈ పదహారేళ్ల కష్టానికి పోరాటానికి నేను ప్రత్యక్ష సాక్షిని… ప్రతి సినిమాను తన సొంత బిడ్డ లాగా ప్రేమిస్తారని నీ ప్రతి సినిమాను ఒక పసిబిడ్డ లాగా చూసుకున్నావు, కొన్ని నడిచాయి,కొన్ని పరిగెత్తాయి మరికొన్ని దెబ్బలు తిన్నాయి. ఇవేవీ నీకు ముఖ్యం కాదు అది ఎప్పటికీ నీ బిడ్డే.
ఇక ఈరోజు రాత్రి ప్యారడైజ్ కూడా తన బేబీ స్టెప్స్ వేయబోతోంది ఏం జరిగినా అంతా మన మంచికే నీకు ఎప్పుడు అండగా మేమున్నాం అంటూ అంజనా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ద్వారా నాని తన సినీ జర్నీలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయాలను ఈమె స్పష్టంగా తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్యారడైజ్ సినిమా నాని కెరీర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!