OTT Movie : కుటుంబ కధా చిత్రాలలో ఉండే ఎమోషన్స్ మామూలుగా ఉండవు. ఇటువంటి సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి చూస్తుంటారు. వీటిని చూస్తున్నంత సేపు ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. మన ఫ్యామిలీని చూసినట్టు ఉంటుంది. కుట్రలు కుతంత్రాలతో, కాకుండా ఒక మంచి ఫీలింగ్ ఇచ్చే, ఒక మరాఠీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మరాఠీ మూవీ పేరు ‘ఘరత్ గణపతి’ (Gharat ghanapati). 2024 లో విడుదలైన ఈ మరాఠీ కుటుంబ డ్రామా మూవీకి నవజ్యోత్ నరేంద్ర బండివాడేకర్ దర్శకత్వం వహించారు. ఇది నావిగ్న్స్ స్టూడియోతో కలిసి పనోరమా స్టూడియోస్ నిర్మించింది. ఇందులో నికితా దత్తా, భూషణ్ ప్రధాన్, అజింక్యా డియో, అశ్విని భావేతో పాటు సంజయ్ మోనే, శుభాంగి లట్కర్ నటించారు. కొంకణ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ, గౌరీ గణపతిని స్వాగతించే ఘరత్ కుటుంబ వార్షిక సంప్రదాయాన్ని చూపిస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఆచారం మూడు తరాల వరకు కొనసాగుతుంది. వారి బంధాలను బలోపేతం చేసే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మహారాష్ట్రలో ఒక మారుమూల పల్లెటూరికి వినాయక చవితి జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు అంతా వస్తారు. గణపతి విగ్రహాన్ని బయట నుంచి తీసుకువస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఆ విగ్రహానికి హారతి ఇవ్వడానికి మహిళలు ఇంటి ముందర సిద్ధంగా ఉంటారు. గణపతి విగ్రహం జారి పడిపోతూ ఉండగా, అక్కడికి కేతన్ వచ్చి పట్టుకుంటాడు. ఆ కుటుంబానికి అప్ప అనే పెద్దమనిషి ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు కుమారుడే ఈ కేతన్. ఇతనితోపాటు కృతి అనే అమ్మాయిని కూడా తీసుకువస్తాడు. మొదట కృతిని తన ఫ్రెండ్ గా పరిచయం చేస్తాడు. అయితే ఇంట్లో వాళ్లకు ఎక్కడో అనుమానం ఉంటుంది. వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని అనుకుంటారు. మరోవైపు కృతి ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆమె చేసే ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్ప మాత్రమే ఆమెను అర్థం చేసుకుంటాడు.
మిగతా వాళ్ళని కూడా ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనుకుంటుంది కృతి. ఆ ఇంట్లో గణపతిని ఏడు రోజుల పాటు పూజ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఈ పండుగని ఒకటిన్నర రోజుకి కుదించాలనుకుంటారు. అప్పాకి చెప్పే సాహసం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ చేయకపోవడంతో, ఆ విషయంలో సైలెంట్ గానే ఉండిపోతారు. ఆ ఇంట్లో జరిగే పూజా కార్యక్రమంలో కృతిని కేతన్ తల్లి తిడుతుంది. అందుకు కృతి చాలా బాధపడుతుంది. చివరికి కేతన్ కృతిల పెళ్లి జరుగుతుందా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఘరత్ గణపతి’ (Gharat ghanapati) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.