OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటికి బడ్జెట్ కూడా భారీగానే పెడతారు. సినిమా బాగుంటే కలెక్షన్స్ కూడా అలాగే వస్తాయి. వీటిలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో అమ్మాయిలను పశువుల్లా పెంచుతుంటారు. చిన్నప్పటి నుంచి బయటికి రానికుండా, 16 సంవత్సరాలు వచ్చేంతవరకు బంధించి పెంచుతారు. మూవీ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘లెవెల్ 16’ (level 16). 2018 లో రిలీజ్ అయిన ఈ కెనడియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి డానిష్కా ఎస్టర్‌హాజీ దర్శకత్వం వహించారు. ఇది ఒక రహస్య ప్రదేశంలో నివసించే బాలికల సమూహాన్ని అనుసరిస్తుంది. దత్తత తీసుకుంటారంటూ, పరిపూర్ణ యువతులుగా ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి అక్కడ జరిగే మిస్టరీని వెలికితీస్తారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కొన్ని వందల మంది అమ్మాయిలను ఒకచోట బంధించి పశువుల్లా పెంచుతారు. వాళ్లకు చదువు గురించి చెప్పకుండా, కేవలం అందం పెంచడం గురించి మాత్రమే చెప్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు బయటపడే మార్గం ఉండదు. అయితే వాళ్లకు మాత్రం 16 సంవత్సరాల దాటిన తర్వాత మిమ్మల్ని దత్తత తీసుకుంటారని అబద్దం చెప్తూ ఉంటారు. ఏజ్ ను బట్టి 16 బ్లాకులుగా అక్కడ అమ్మాయిలను డివైడ్ చేస్తారు. మొత్తం మానిటర్ స్క్రీన్ మీద నిఘా ఉంచుతారు. అందులో హీరోయిన్, సోఫియా కాస్త తెలివిగా ఆలోచిస్తారు. ప్రతిరోజు నిద్ర మాత్రలు ఇచ్చి, అవన్నీ ఐరన్ టాబ్లెట్స్ అని చెప్పి నిద్రపుచ్చుతారు. ఆ మత్తులో ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డు ఒకడు వీళ్లను అసభ్యంగా తాకుతూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళకు అనుమానం వచ్చి నిద్రమాత్రలు మింగినట్టు నటిస్తారు. అప్పుడు వీళ్లను ఒక చోటికి తీసుకెళ్తారు. అక్కడ జరిగే సంభాషణ వింటారు. వీళ్లను ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటారు.
ఇది తెలుసుకున్న హీరోయిన్ అమ్మాయిలను చూసుకునే హెడ్ దగ్గరికి వెళ్లి, ఆమెను కొట్టి స్పృహ కోల్పోయే విధంగా చేస్తుంది. ఆమె దగ్గర ఉన్న యాక్సిస్ ని తీసుకుని బయటికి వెళ్లాలని అనుకుంటుంది. అక్కడ ఒక గదిలో చాలామంది అమ్మాయిల శవాలు కూడా పడి ఉంటాయి. ఆశవాలకి చర్మం మొత్తం తొలగించి ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, చర్మం కోసం అందర్నీ చంపుతున్నారని. అక్కడికి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి, అందం కోసం అమ్మాయిల చర్మాన్ని కొని, యవ్వనంగా కనిపించడానికి సర్జరీ చేసుకుంటూ ఉంటారు. దీనిని ఒక మాఫియా గ్రూప్ నిర్వహిస్తూ ఉంటుంది. చివరికి హీరోయిన్ అక్కడినుంచి తప్పించుకుంటుందా? అక్కడ ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని చూడండి.