E-Paper
Advertisement

Ghooskhor Pandat movie : ఓటీటీ నుంచి మనోజ్ బాజ్‌పేయి సినిమా డిలీట్… వివాదం ఏంటంటే?

Ghooskhor Pandat movie : ఓటీటీ నుంచి మనోజ్ బాజ్‌పేయి సినిమా డిలీట్… వివాదం ఏంటంటే?
Advertisement

Ghooskhor Pandat movie : మనోజ్ బాజ్‌పేయి పేరు ప్రముఖ నటుల జాబితాలో ఎప్పుడూ ఉంటుంది. అతని యాక్టింగ్ అలా ఉంటుంది మరి. అయితే ఈ హీరో సినిమా గురించి ఇప్పుడు ఒక వివాదాం నడుస్తోంది. నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయిల కాప్ డ్రామా ‘ఘూస్‌ఖోర్ పండాట్‌’ (Ghooskhor Pandat movie)నెట్‌ఫ్లిక్స్ గ్రిప్పింగ్ టీజర్‌తో ప్రకటించినప్పటి నుండి వార్తల్లో నిలుస్తోంది. ఇది బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరిచేదిగా ఉందని, ఈ చిత్రం సోషల్ మీడియాలో వివాదాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌లో, పిటిషనర్ ఢిల్లీ హైకోర్టులో రిలీజ్ ను నిలిపివేయాలని కోరారు. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని విన్నపించారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ చిత్రం ఆగిపోయింది కూడా.

ఎఫ్ఐఆర్ నమోదు 

ప్రజల మనోభావాలను దెబ్బ తీసినందుకు నిర్మాతలు, సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించడం జరిగింది. దీంతో మేకర్స్ బాగానే చిక్కుల్లో పడ్డారు. ఇక ఎఫ్ఐఆర్ సంఘటన జరిగిన వెంటనే, నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, ఇది అవినీతిపరుడైన ఒక పోలీసు పాత్ర కథనానికి సంబంధించినదని, ఏ సామాజిక వర్గాన్ని కించపరిచేది కాదని చెప్పుకొచ్చారు.

ఇంటర్నెట్ నుండి టీజర్‌ తొలగింపు

Advertisement

ఇక ఈ చిత్ర నిర్మాత నీరజ్ పాండే టైటిల్ వివాదంపై స్పందించి, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వివరణ కూడా ఇచ్చారు. అందులో ఆయన టైటిల్‌ను సమర్థించారు. ‘పండిట్’ అనే పదాన్ని మర్యాద పూర్వకంగా కూడా పిలుస్తారని, అది ఏ సమాజం లేదా కులానికి సంబంధించినది కాదని వెల్లడించారు. ఒక వేల ప్రజల మనోభావాలను దెబ్బతీసిఉంటే క్షమాపణలు కూడా తెలిపారు. అంతేకాకుండా, ఇంటర్నెట్ నుండి టీజర్‌ ను కూడా తొలగించారు. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ చిత్రాన్ని తన జాబితాల నుండి తొలగించింది. ఈ సినిమాను ఏవైనా మార్పులతో మళ్ళీ ప్లాట్‌ఫామ్‌లలో తిరిగి తీసుకొస్తారా ? సినిమా టైటిల్ మారుస్తారా ? అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Read Also : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×