E-Paper
Advertisement

ప్రతి ఎపిసోడ్‌లో కొత్త దెయ్యం… ఈ సిరీస్లో చివరి కథ అయితే ఒంటరిగా చూడలేరు

ప్రతి ఎపిసోడ్‌లో కొత్త దెయ్యం… ఈ సిరీస్లో చివరి కథ అయితే ఒంటరిగా చూడలేరు
Advertisement

Korean Horror Anthology on OTT : కొరియన్ హారర్ సినిమాలు, సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అలాంటి హారర్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్‌లలో ‘గోదామ్’ (Goedam) కూడా ఒకటి. దక్షిణ కొరియాలో తరతరాలుగా ప్రచారంలో ఉన్న భయంకరమైన అర్బన్ లెజెండ్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ హారర్ యాంథాలజీ ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త దెయ్యం కథను పరిచయం చేస్తుంది. కేవలం 7 నుంచి 15 నిమిషాల నిడివి మాత్రమే ఉన్నప్పటికీ, ప్రతి కథలోనూ సస్పెన్స్, భయం, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. ప్రస్తుతం ఈ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? కథ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

‘గోదామ్’ ఒకే కథతో సాగే వెబ్ సిరీస్ కాదు. మొత్తం ఎనిమిది వేర్వేరు హారర్ కథల సమాహారం. ప్రతి కథకు వేర్వేరు పాత్రలు, వేర్వేరు నేపథ్యం ఉన్నా, అన్నింటిలోనూ ఒకే అంశం కనిపిస్తుంది. అదే.. సాధారణ మనుషుల జీవితాల్లో అకస్మాత్తుగా ప్రవేశించే అతీంద్రియ శక్తులు.

Advertisement

మొదటి ఎపిసోడ్‌లో కాలేజీలో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ సాధించే ఓ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత రెండో ర్యాంక్‌లో ఉన్న విద్యార్థిని ఫస్ట్ ప్లేస్‌కి వస్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. కాలేజీ రెస్ట్‌రూమ్‌లో ఆమెకు చనిపోయిన విద్యార్థిని దెయ్యంగా కనిపించడం, ఆ తర్వాత జరిగే భయంకరమైన సంఘటనలు కథను ఆసక్తికరంగా మారుస్తాయి.

రెండో ఎపిసోడ్‌లో అర్ధరాత్రి సమయంలో ఓ టాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్న మిస్టీరియస్ మహిళ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె చెప్పిన చిరునామాకు చేరుకునే సరికి ప్రయాణికురాలు కనిపించకుండా పోవడం, ఆ తర్వాత జరిగే విచిత్ర సంఘటనలు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి.

Advertisement

మరో కథలో ముగ్గురు యువతులు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కొత్త ఇంటిలో గడపాలని నిర్ణయించుకుంటారు. కానీ కెమెరాలో కనిపించిన కొన్ని వింత నీడలు వారి జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అలాగే ఒక స్కూల్ భవనంలో రాత్రి చిక్కుకుపోయిన విద్యార్థిని ఎన్ని మెట్లు దిగినా బయటకు రాలేకపోవడం, ఎరుపు చెప్పుల వెనుక దాగి ఉన్న దెయ్యం, లిఫ్ట్ ద్వారా మరో భయంకరమైన ప్రపంచంలోకి వెళ్లే డిటెక్టివ్, ఇంటిని కాపాడే తాయెత్తు తొలగించడంతో జరిగే విషాదం వంటి కథలు ఒక్కోటి ఒక్కోరకమైన భయాన్ని కలిగిస్తాయి.

చివరి ఎపిసోడ్‌లో ఓ మంత్రగత్తె మరింత శక్తి కోసం ప్రమాదకరమైన చేతబడి చేస్తుంది. అయితే ఆమె బలి ఇచ్చిన చిన్నారి ఆత్మ తిరిగి వచ్చి తీర్చుకున్న ప్రతీకారం సిరీస్‌కు షాకింగ్ ముగింపును ఇస్తుంది. ప్రతి ఎపిసోడ్ ముగిసే సరికి ప్రేక్షకుల్లో మరో కథపై ఆసక్తి పెరిగేలా దర్శకుడు కథనాన్ని రూపొందించారు.

Also Read : 18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

తెలుగులో ఉందా ?

‘గోదామ్’ ప్రధాన బలం షార్ట్ ఫార్మాట్. ప్రతి ఎపిసోడ్ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి కావడం వల్ల బోర్ అనిపించదు. కొరియన్ అర్బన్ లెజెండ్స్ ఆధారంగా రూపొందించిన కథలు కొత్త అనుభూతిని ఇస్తాయి. జంప్ స్కేర్స్, డార్క్ సినిమాటోగ్రఫీ, హారర్ సౌండ్ డిజైన్, ఊహించని ట్విస్టులు హారర్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఒకేసారి మొత్తం సిరీస్‌ను బింజ్ వాచ్ చేయగలిగేలా ఉండటం కూడా మరో ప్లస్ పాయింట్. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ప్రస్తుతం దీన్ని కొరియన్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో మాత్రమే వీక్షించవచ్చు. తక్కువ సమయంలోనే భయపెట్టే హారర్ కథలు, కొరియన్ అర్బన్ లెజెండ్స్, జంప్ స్కేర్ ఆధారిత సిరీస్‌లు ఇష్టపడే వారికి ‘గోదామ్’ సూపర్ ఆప్షన్. ప్రతి ఎపిసోడ్ కొత్త భయాన్ని పరిచయం చేస్తూ, చివరి వరకు గ్రిప్పింగ్ గా కొనసాగే ఈ నెట్‌ఫ్లిక్స్ హారర్ యాంథాలజీని హారర్ అభిమానులు అస్సలు మిస్ కాకూడదు.

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×