BigTV English
Advertisement

OTT Movie : ఒక్క పాడు సీన్ లేదు… లవ్ స్టోరీ లేదా కమర్షియల్ కాదు… వందల కోట్లు కొల్లగొట్టిన సినిమా

OTT Movie : ఒక్క పాడు సీన్ లేదు… లవ్ స్టోరీ లేదా కమర్షియల్ కాదు… వందల కోట్లు కొల్లగొట్టిన సినిమా

OTT Movie : రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన ఒక తమిళ్ మూవీ, బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఓటిటిలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమాను చూసి రాజమౌళి కూడా మెచ్చుకోవడంతో ప్రేక్షకులు వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీలంక నుంచి ఇండియాకి వలస వచ్చే ఒక ఫ్యామిలీ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

ధర్మదాస్ (శశికుమార్) తన భార్య వసంతి (సిమ్రాన్), ఇద్దరు కొడుకులు నీతుషన్ (మిథున్ జై శంకర్), ముల్లి (కమలేష్ జెగన్)తో కలిసి శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభం, రాజకీయ సమస్యల కారణంగా భారతదేశంలోని చెన్నైకి వలస వస్తాడు. వీళ్ళు తమ గుర్తింపును దాచడానికి మలయాళీలుగా నటిస్తూ, కేసవ నగర్ అనే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుంటారు. ధర్మదాస్ డ్రైవర్‌గా తాత్కాలిక ఉద్యోగం సంపాదిస్తాడు. వసంతి స్థానికులతో మంచిగా నడుచుకుంటుంది. అయితే రామేశ్వరంలో జరిగిన ఒక బాంబు పేలుడు కారణంగా, పోలీసులు ఈ శ్రీలంక వలసదారులపై అనుమానం వ్యక్తం చేస్తారు. ధర్మదాస్ కుటుంబం సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో వీళ్ళపై పోలీసులకు అనుమానం బలపడుతుంది.


ఏసీపీ బల్వాన్ సింగ్, భైరవన్ ఈ కుటుంబాన్ని పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో ధర్మదాస్ కుటుంబం తమ గుర్తింపును దాచడానికి ప్రయత్నిస్తూ, స్థానికులతో ఆప్యాయంగా కలిసిపోతుంది. ధర్మదాస్ ఒక అల్కహాలిస్ట్ లో మార్పును తేవడంతో పాటు, ఒక యువకున్ని కూడా కాపాడతాడు. ఇలా ఈ ఫ్యామిలీ ఆ కాలనీలో ఉన్న అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అయితే వీళ్లపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. చివరికి బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు ? పోలీసులు వీళ్ళని పట్టుకుంటారా ? వీళ్ళు తమిళ నాడుకు రావడానికి అసలు కారణం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ ఫీల్ గుడ్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ అమ్మాయి అరాచకం చూడడానికి రెండు కళ్ళూ చాలవు… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్

జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో

ఈ తమిళ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). 2025 లో విడుదలైన ఈ సినిమా అబిషన్ జీవింత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో శశికుమార్,సిమ్రాన్, యోగి బాబు,కమలేష్ జెగన్, మిథున్ జై శంకర్ వంటి నటులు నటించారు. ఈ మూవీ శ్రీలంక నుండి భారతదేశంలోని తమిళనాడుకు వలస వచ్చిన ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×