BigTV English

OTT Movie : తల్లిని ఇంటరాగేషన్‌ చేసే కొడుకులు … ముసుగు వెనుక గందరగోళం .. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

OTT Movie : తల్లిని ఇంటరాగేషన్‌ చేసే కొడుకులు … ముసుగు వెనుక గందరగోళం .. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

OTT Movie : ఆస్ట్రియాలోని ఒక మోడరన్ హౌస్‌లో ఎలియాస్, లూకాస్ అనే 9 ఏళ్ల ట్విన్ బాయ్స్ తమ తల్లి కోసం ఎదురుచూస్తుంటారు. ఆమె ఫేస్-చేంజింగ్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తిరిగి ఇంటికి వస్తుంది. ఆమె మొఖం బ్యాండేజ్‌లతో కప్పబడి, కళ్ళు, నోరు మాత్రమే కనిపిస్తాయి. అయితే ఆమె ప్రవర్తన వల్ల బాయ్స్‌కు అనుమానం మొదలవుతుంది. ఇంతకీ ఈ బ్యాండేజ్‌లతో ఉన్న మహిళ నిజంగా వాళ్ళ తల్లేనా ? ఈ సీక్రెట్ వెనుక ఏముంది ? ఈ క్వెస్ట్ ఎంత డేంజరస్ అవుతుంది? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఆస్ట్రియాలోని ఒక ఐసోలేటెడ్ మోడరన్ హౌస్‌లో జరుగుతుంది. చుట్టూ కార్న్‌ఫీల్డ్స్, అడవులు మాత్రమే ఉంటాయి. 9 ఏళ్ల ట్విన్ బాయ్స్ అయిన ఎలియాస్, లూకాస్ తమ తల్లి కోసం ఎదురుచూస్తుంటారు. ఆమె ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఇక్కడినుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఆమె మొఖం కళ్ళు, నోరు తప్పించి బ్యాండేజ్‌లతో కప్పబడి ఉంటుంది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పటినుంచి వింతగా ప్రవర్తిస్తుంది. విచిత్రమైన రూల్స్ పెడుతుంది. శబ్దం చేయకూడదని, ఆమె రూంలోకి ఎవరూ రాకూడదని కండిషన్స్ పెడుతుంది.


ఆమె పిల్లలను పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. తల్లి ప్రవర్తన అనుమానాస్పదంగా మారుతుంది.  ఒక స్ట్రే క్యాట్‌పై కూడా క్రూరంగా ప్రవర్తిస్తుంది. బాయ్స్ ఆమె గతంలో చూపించిన మదర్లీ వార్మ్‌తో ఈ ప్రవర్తనను కంపేర్ చేస్తూ, ఆమె తమ నిజమైన తల్లి కాదని అనుమానిస్తారు. బాయ్స్ తమ అనుమానాలను టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆమెను క్వశ్చన్ చేస్తారు. ఆమె రియాక్షన్స్‌ను గమనిస్తారు. ఆమె గురించి క్లూస్ కోసం హౌస్‌లో సెర్చ్ చేస్తారు. వారు ఒక ఓల్డ్ ఫోటో ఆల్బమ్‌లో తమ తల్లిని ఒక ఇడెంటికల్ ట్విన్‌తో చూస్తారు. దీనితో వారి అనుమానాలు మరింత బలపడతాయి. వారు ఆమెను కట్టేసి, ఆమె ఐడెంటిటీని ప్రూవ్ చేయమని డిమాండ్ చేస్తారు. ఇది ఒక డిస్టర్బింగ్ ఇంటరాగేషన్‌కు దారితీస్తుంది.

బాయ్స్ చర్యలు ఇంకా వయోలెంట్ గా మారతాయి. తల్లి వారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె వర్డ్స్ వాళ్ళ డౌట్స్‌ను రెయిస్ చేస్తాయి. కథ క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. చివరికి బ్యాండేజ్‌ల కింద ఉన్న మహిళ నిజంగా తల్లి కాదా ? పిల్లలను తల్లి ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది? బాయ్స్ ఇంటరాగేషన్ ఎంత దూరం వెళ్తుంది? ఫైనల్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మాట్లాడే మాయా చేప… ఇలాంటి మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సైకలాజికల్ హర్రర్ సినిమా పేరు ‘గుడ్ నైట్ మమ్మీ'(Goodnight Mommy). 2014 లో వచ్చిన ఈ సినిమాకు వెరోనికా ఫ్రాంజ్, సెవెరిన్ ఫియాలా దర్శకత్వం వహించారు. ఇందులో సుసానే వూస్ట్ (తల్లి), ఎలియాస్ ష్వార్జ్ (ఎలియాస్), లూకాస్ ష్వార్జ్ (లూకాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 99 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి  IMDb లో 6.7/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×