BigTV English

OTT Movie : మాట్లాడే మాయా చేప… ఇలాంటి మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

OTT Movie : మాట్లాడే మాయా చేప… ఇలాంటి మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

OTT Movie : రష్యాలో ఎమెల్యా అనే ఒక ఒక గ్రామీణ యువకుడు, తన రోజువారీ జీవితంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. ఒక రోజు చేపల వేటలో అతను ఒక మాయా చేపను పట్టుకుంటాడు. అది మూడు కోరికలను నెరవేర్చగలదని చెప్తుంది. కానీ ఎమెల్యా, తన అమాయకత్వంతో, ఈ కోరికలను అనుకోకుండా వృథా చేస్తాడు. తన చివరి కోరికను రాజకుమారి అన్ఫిసాను వివాహం చేసుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయిస్తాడు. అయితే అన్ఫిసా అతన్ని సవాలు చేస్తూ, అసాధ్యమైన పనులను ఆదేశిస్తుంది. ఎమెల్యా ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడా ? ఈ మాయా ప్రపంచంలో ఎమెల్యా తన నిజమైన ప్రేమను కనుగొంటాడా? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం ..


స్టోరీలోకి వెళితే

పురాతన రష్యాలో ఎమెల్యా అనే ఒక అమాయక గ్రామీణ యువకుడు చేపలు పడుతూ జీవిస్తుంటాడు. ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు, అతనికి ఒక మ్యాజిక్ చేప దొరుకుతుంది. ఈ చేప ఎమెల్యాతో మాట్లాడుతూ, తనని విడిచిపెడితే మూడు కోరికలను నెరవేరుస్తానని చెప్తుంది. ఈ క్రమంలో ఎమెల్యా తన మొదటి కోరికను అనుకోకుండా వృథా చేస్తాడు. రెండవ కోరికను కూడా అతను వృథా చేస్తాడు. శీతాకాలంలో వేసవి రావాలని కోరుతాడు. ఈ మయా చేప దాన్ని నెరవేర్చి ప్రకృతిని మారుస్తుంది. ఈ ప్రయాణంలో, దొంగలు ఎమెల్యాపై దాడి చేస్తారు. అతని వద్ద ఏమీ లేకపోవడంతో చేపను ఎత్తుకెళ్ళాలనుకుంటారు. దొంగల నుండి తప్పించుకునే క్రమంలో, ఎమెల్యా చేపను నదిలో విడిచిపెడతాడు. కానీ అతన్ని దొంగలు పట్టుకొని చెట్టుకు తలకిందులుగా కట్టేస్తారు. అప్పుడు చేప వాసిలిసా అనే అందమైన అమ్మాయిగా మారి, ఎమెల్యాను రక్షిస్తుంది.


వాసిలిసా ఒక యువరాణి.  కోష్చీ ది ఇమ్మోర్టల్ కుమార్తె. ఒక శాపం కారణంగా చేప రూపంలో మూడు కోరికలను నెరవేర్చే బాధ్యత కలిగి ఉంది. కానీ ఆమె తన స్వంత కోరికలను నెరవేర్చుకోలేదు. ఆమె ఎమెల్యాపై ప్రేమను పెంచుకుంటుంది. ఇక ఎమెల్యా తన చివరి కోరికను రాజకుమారి అన్ఫిసాను వివాహం చేసుకోవడానికి ఉపయోగించాలని అనుకుంటాడు. అన్ఫిసా మాత్రం ఇంగ్లీష్ అంబాసిడర్ లార్డ్ రోత్మాన్ ను వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఆతరువాత స్టోరీ ఒక అడ్వెంచర్ టర్న్ తీసుకుంటుంది. చివరికి ఎమెల్యా తన చివరి కోరికను అన్ఫిసాతో వివాహం కోసం ఉపయోగిస్తాడా ? లేకపోతే వాసిలిసాతో తన ప్రేమను ఎంచుకుంటాడా? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : డేటింగ్ గేమ్ ఆడే సైకో కిల్లర్ … వందకు పైగా అమ్మాయిలకు నరకం … వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ పేరు ‘Wish of the Fairy Fish’.  2023 లో వచ్చిన ఈ సినిమాకు అలెగ్జాండర్ వోయిటిన్స్కీ దర్శకత్వం వహించారు. ఇందులో నికితా కొలోగ్రివీ, అలీనా అలెక్సీవా,రోమన్ మడ్యానోవ్,ఫ్యోడర్ లావ్రోవ్, యూరీ కొలోకోల్నికోవ్ వంటి నటులు నటించారు. ఎమెల్యా అనే ఒక గ్రామీణ యువకుడి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆపిల్ టివి (AppleTV) లో ఈ సినిమా అందుబాటులో ఉంది .

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×