BigTV English

OTT Movie : ఈ లేడీ సైకో ఎంతకు తెగిచింది భయ్యా ? బతికుండగానే చర్మాన్ని వలిచి టార్చర్… ఒక్కో ట్విస్ట్ కు గుండె గుభేల్

OTT Movie : ఈ లేడీ సైకో ఎంతకు తెగిచింది భయ్యా ? బతికుండగానే చర్మాన్ని వలిచి టార్చర్… ఒక్కో ట్విస్ట్ కు గుండె గుభేల్

OTT Movie : ఒక ఆసక్తికరమైన బాడీ హారర్ సినిమా ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఈ చిత్రం హారర్ ప్రియులకు ఒక గుర్తిండిపోయే అనుభవాన్ని అందిస్తుంది. అందం కోసం తీవ్రమైన చర్యలకు దిగే ఒక యువతి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. దీని గ్రాఫిక్ హారర్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


షడ్డర్ లో స్ట్రీమింగ్

‘గ్రాఫ్టెడ్’ (Grafted) అనేది న్యూజిలాండ్‌లో తీసిన ఒక బాడీ హారర్-డ్రామా చిత్రం. 2024లో వచ్చిన ఈ సినిమాకి సాషా రెయిన్‌బో దర్శకత్వం వహించారు. జోయెనా సన్, జెస్ హాంగ్, మరియు ఈడెన్ హార్ట్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 ఆగస్టు 9న న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రం 2024 నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఇది రాటెన్ టొమాటోస్‌లో 77% రేటింగ్‌ను, IMDbలో 5.6/10 రేటింగ్‌ను సంపాదించింది. ప్రస్తుతం షడ్డర్ (Shudder) ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ చైనాలోని వీ అనే ఒక యువతితో మొదలవుతుంది. వీ తన తండ్రితో కలిసి జీవిస్తుంటుంది. అతను ఒక వైద్య పరిశోధకుడు. వీ ఆమె తండ్రి ఇద్దరూ ముఖంపై పుట్టుకతోనే ఒక లోపాన్ని కలిగి ఉంటారు. ఇది వారి జీవితంలో పెన్ మార్పులకు దారి తీస్తుంది. వీ తండ్రి చర్మ సంబంధిత లోపాలను సరిచేయడానికి ఒక విప్లవాత్మక సీరంను తయ్యారు చేస్తుంటాడు. అయితే ఈ సీరంను అతనిపై పరీక్షించినప్పుడు, అది అతని చర్మాన్ని నియంత్రణ లేకుండాపెరిగేలా చేస్తుంది. ఫలితంగా అతను ఊపిరాడక మరణిస్తాడు. ఈ ఘటన వీని జీవితంలో ఒక మరచిపోలేని గాయాన్ని మిగిల్చి, ఆమెను తన తండ్రి పరిశోధనను కొనసాగించే దిశలో నడిపిస్తుంది.

కొన్ని సంవత్సరాల తర్వాత, వీ ఒక ప్రతిష్టాత్మక న్యూజిలాండ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సంపాదించి, అక్కడ తన తండ్రి పరిశోధనను కొనసాగించడానికి వెళ్తుంది. ఆమె తన అత్త లింగ్, సోదరి ఆంజెలాతో కలిసి ఆక్లాండ్‌లో నివసిస్తుంది. ఆంజెలా, వీ తో కలసి ఉండటానికి అంతగా ఇష్టపడదు. ఆంజెలా స్నేహితురాలు ఈవ్ కూడా వీ పట్ల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఆమె బర్త్‌మార్క్‌ను అందరూ ఎగతాళి చేస్తుంటారు. దీని వల్ల ఆమె ఒంటరితనాన్ని మరింత అనుభవిస్తుంది. ఈ క్రమంలో వీ తన పరిశోధనను యూనివర్సిటీలో కొనసాగిస్తుంది. కానీ ప్రొఫెసర్ పాల్ ఆమె పరిశోధనను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. అతను ఈవ్‌తో సంబంధం కలిగి ఉంటాడు.

ఈ సమయంలో, ఆంజెలాతో జరిగిన ఒక తీవ్రమైన వాగ్వాదం ఆమె మరణానికి దారితీస్తుంది. వీ ఆత్మరక్షణలో ఆంజెలాను చంపుతుంది. ఈ సంఘటన వీ జీవితంలో ఒక చీకటి మలుపుకు లాగుతుంది. ఆమె తన సీరంను ఉపయోగించి ఆంజెలా ముఖ చర్మాన్ని తన ముఖంపై గ్రాఫ్ట్ చేస్తుంది. ఆంజెలా లాగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. వీ ఆంజెలాగా నటిస్తూ, ఆమె స్నేహితుల సమూహంలో చేరడానికి ప్రయత్నిస్తుంది. ఈవ్, ఆమె స్నేహితురాలు జాస్మిన్ ఆమె ప్రవర్తనను అనుమానిస్తారు. వీ, తన రహస్యాన్ని కాపాడుకోవడానికి, మరింత హింసాత్మక చర్యలకు దిగుతుంది. ఈ క్రమంలో స్టోరీ హింసాత్మకంగా మారుతుంది. వీ ఇంకా ఎంతమందిని ఎదుర్కొంటుంది ? ఆమె దోషిగా అందరిముందూ నిలబడుతుందా ? ఆమె ప్రయోగం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : బుర్ఖా వేసుకుని బుర్రపాడు పనులు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×