Telugu Movies: తెలుగు సినీ ప్రేమికులకి మార్చ్ 28 న ఓ రసవత్తరమైన బాక్సాఫీస్ పోటీ జరగనుంది. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా, అలాగే యూత్ లో క్రేజ్ పెంచుకున్న మ్యాడ్ 2 ఒకే రోజు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. రెండు సినిమాలూ కామెడీ ఎలిమెంట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం, ఒకటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయితే మరొకటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడం ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల రన్ ని పక్కా డేంజర్ లో పెట్టేలా మరో పెద్ద సినిమా కూడా అదే సమయానికి రిలీజ్ అవుతోంది.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతంలో వచ్చిన భీష్మ బ్లాక్ బస్టర్ కావడంతో రాబిన్ హుడ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ప్రామోషన్స్ కూడా ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. టీజర్ లో చూపించిన నితిన్ స్టైలిష్ లుక్, వెంకీ మార్క్ ఎంటర్టైన్మెంట్ అందరిని ఆకట్టుకున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాయి.
మ్యాడ్ 1 అనూహ్య విజయం సాధించిన తర్వాత, దాని సీక్వెల్ మ్యాడ్ 2 పై మరింత ఆసక్తి పెరిగింది. సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యువతను బాగా ఆకర్షిస్తోంది. టీజర్ చూస్తే ఫ్రెండ్షిప్, ఎనర్జీని మిక్స్ చేసి ఆకట్టుకునేలా తెరకెక్కించినట్టు స్పష్టమవుతోంది. మొదటి భాగం హిట్ కావడంతో మ్యాడ్ 2 కి ముందు నుంచే ఓ లెక్కలో బెనిఫిట్ ఉంది.
ఇప్పుడు అసలు సీన్ లోకి వచ్చే సినిమా ఎంపురాన్. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలిసి చేసిన ఈ మూవీకు తెలుగులో కూడా బలమైన క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో గ్రాండ్ విజువల్స్, పవర్ ఫుల్ ఎలివేషన్స్ కనిపించాయి. హై ఓక్టేన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఎంపురాన్ కి అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మూడు సినిమాలూ మంచి హైప్ లో ఉన్నాయి. కానీ ఎంపురాన్ తెలుగు ప్రేక్షకులను కాస్త ఎక్కువగా ఆకర్షిస్తే, రాబిన్ హుడ్, మ్యాడ్ 2 కి లాంగ్ రన్ కష్టమవుతుంది. ముఖ్యంగా మ్యాడ్ 2 మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే, రాబిన్ హుడ్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ని కలిపి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎంపురాన్ వంటి యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లో క్లాస్, మాస్ అని తేడా లేకుండా రెస్పాన్స్ తెచ్చుకుంటే, తెలుగు సినిమాలకు పెద్ద సవాల్ అవుతుంది.
మార్చ్ 28న థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకుల ముందున్న ఛాయస్ క్లియర్. కామెడీ, మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం రాబిన్ హుడ్, మ్యాడ్ 2 అయితే, హై ఇన్‌టెన్స్ యాక్షన్ కోసం ఎంపురాన్. బాక్సాఫీస్ పోటీ ఎలా మారుతుందో చూడాలి, కానీ ఓ విషయంలో మాత్రం సందేహం లేదు—ఈ పోటీ ఉత్కంఠభరితంగా మారబోతోందని!