E-Paper
Advertisement

OTT Movie : చిన్ననాటి లవ్ స్టోరీలను గుర్తు చేసే సిరీస్… ఒక్కో ఎపిసోడ్ వేరే లెవెల్ మావా

OTT Movie : చిన్ననాటి లవ్ స్టోరీలను గుర్తు చేసే సిరీస్… ఒక్కో ఎపిసోడ్ వేరే లెవెల్ మావా
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక టీన్ రొమాంటిక్ సిరీస్ ను యూత్ తెగ చూసేస్తున్నారు. భోపాల్ కోచింగ్ సెంటర్ నేపథ్యంలో సాగే ఈ టీనేజ్ లవ్, చైల్డ్‌హుడ్ మెమరీస్ ని రికాల్ చేస్తుంది. రియలిస్టిక్ నటన, ఆకట్టుకునే స్టోరీ ఈ సిరీస్ ని టాప్ రేటింగ్ లో నిలబెట్టింది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే మూడు సీజన్లను వదిలి పెట్టరు. ఈ చూడ చక్కని రొమాంటిక్ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ హిందీ టీన్ రొమాంటిక్ డ్రామా సీరీస్ పేరు ‘గుతార్ గూ’ (Gutar Gu). సాకిబ్ పాండోర్ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ ను సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నిర్మించింది. ఇందులో విశేష్ బన్సల్ (అనుజ్), అశ్లేష తకూర్ (రితు) లీడ్ రోల్స్ లో నటించారు. మూడు సీజన్లతో ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మొదటి సీజన్ 2023ఏప్రిల్ 4, రెండవ సీజన్ 2024 అక్టోబర్ 11, మూడవ సీజన్ 2025 జూలై 17న స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఐయండిబిలో దీనికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

Read Also : నాట్యగత్తెతో పోస్ట్ మ్యాన్ ప్రేమ కథ…పెళ్లయినా ఆమె మత్తులోనే… క్లైమాక్స్ కేక

స్టోరీ ఏమిటంటే

అనుజ్ భోపాల్ కోచింగ్ సెంటర్‌లో చదువుతుంటాడు. ఒక రోజు గుర్గావ్ నుంచి కొత్త అమ్మాయి రితు క్లాస్‌లో జాయిన్ అవుతుంది. అనుజ్‌కి ఫస్ట్ సైట్‌లోనే గుండెల్లో గంట మొగుతుంది. రితు కూడా అనుజ్‌ని గమనిస్తుంది. క్యాంటీన్‌లో, బస్టాప్‌లో కళ్లతోనే మాట్లాడుకుంటారు. చివరికి రితు హాయ్ అంటుంది. అనుజ్ స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని రాత్రి గంటలు మాట్లాడుకోవడం, చిన్న చిన్న గిఫ్ట్స్ తో లవ్ ట్రాక్ చాలా క్యూట్ గా నడుస్తుంది. కానీ రితు ఫ్రెండ్స్ అనుజ్‌ని టీజ్ చేస్తారు. రితు కూడా నవ్వేస్తుంది. అనుజ్ హర్ట్ అయి వెళ్లిపోతాడు. రితు క్షమాపణ చెప్పాలనుకుంటుంది కానీ ఇద్దరూ ఈగోలో ఉంటారు.

Advertisement

చివరికి వర్షంలో ఓ రోజు అనుజ్ ని కలిసి రితు ఏడుస్తుంది. అనుజ్ మనసు కరిగి హగ్ ఇచ్చి క్షమించేస్తాడు. ఇద్దరూ ఫస్ట్ కిస్ కూడా చేసుకుంటారు. సీజన్ 1 అక్కడితో స్వీట్‌గా ఎండ్ అవుతుంది. సీజన్ 2 & 3లో ఇద్దరూ కాలేజ్‌లో డిఫరెంట్ సిటీస్ లో ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ మొదలవుతుంది. రితు తన కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తే అనుజ్ హర్ట్ అవుతుంటాడు. పెద్దలు వీళ్ళ ప్రేమకు వ్యతిరేకంగా ఉంటారు. చివరికి వీళ్ళు తమ ప్రేమను గెలిపించుకుంటారా ? ఇగోతో విడిపోతారా ? అనే విషయాలను, ఈ టీన్ రొమాంటిక్ డ్రామా సీరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×