OTT Movie : సైకోలు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ప్రేమ పేరుతో వికృతంగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు పక్కనే ఉండి గోతులు తీస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక అబ్బాయి తన కన్నా పెద్ద వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించి, ఆమె జీవితాన్ని హ్యాక్ చేస్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
సమీరా ఖన్నా అలియాస్ సామ్ ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌లో ఎడిటర్‌గా పనిచేస్తుంది. ఆమె జీవితం కొంత ఒడిదుడుకుల్లో ఉంటుంది. ఆమె తల్లి ఆసుపత్రిలో జీవన్మరణ సమస్యతో పోరాడుతోంది. మరో వైపు ఆమె సినీ నటుడు అయిన ఓం కపూర్ తో రిలేషన్ లో ఉంటుంది. సామ్ తో ఈ రిలేషన్ ని గుట్టుగా ఉంచడానికే చూస్తుంటాడు ఓం. తన భార్యకు విడాకులు ఇస్తానని ఆమెతో సంబంధం కొనసాగిస్తాడు. అయితే విడాకులు ఇవ్వకుండా సామ్ తో గడుపుతుంటాడు. ఈ క్రమంలో సామ్‌కు పొరుగున నివసించే 19 ఏళ్ల వివేక్ తివారీ అనే యువకుడు ఆమెపై ఫీలింగ్స్ ని పెంచుకుంటాడు. వివేక్ ఒక నైపుణ్యం గల హ్యాకర్. సామ్ పుట్టినరోజు పార్టీలో ఓం రాకపోవడంతో ఆమె నిరాశకు గురవుతుంది. ఈ సమయంలో వివేక్ ఆమెను ఓదార్చడం ద్వారా దగ్గరవుతాడు. వారిద్దరూ ఒక రాత్రి ఏకాంతంగా గడుపుతారు. అయితే తర్వాత సామ్ దీనిని తప్పుగా భావించి, వివేక్‌తో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది.
అయితే సామ్ దూరంగా ఉండటాన్ని వివేక్ జీర్ణించుకోలేకపోతాడు. ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి తన హ్యాకింగ్ నైపుణ్యాలను ఉపయోగిస్తాడు. అతను ఆమె సోషల్ మీడియా ఖాతాలను, కంపెనీ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేస్తాడు. దీని వల్ల సామ్ తన ఉద్యోగాన్ని కోల్పోతుంది. అంతే కాకుండా అతను సామ్, ఓం సన్నిహిత ఫోటోలను లీక్ చేస్తాడు. దీంతో ఓం ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటాడు. ఇప్పుడు సామ్ జీవితం గందరగోళంలో పడుతుంది. సామ్ వివేక్‌పై పోలీసు ఫిర్యాదు చేస్తుంది, కానీ వివేక్ తన హ్యాకింగ్ నైపుణ్యాలతో పోలీసులను కూడా మోసం చేసి తప్పించుకుంటాడు. చివరగా, సామ్ తన పొరుగువాడైన రోహన్ సహాయంతో వివేక్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి సామ్, వివేక్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆమె ఎవరితో రిలేషన్ పెట్టుకుంటుంది ? సామ్ సమస్యలు తీరిపోతాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : జనాభాను తగ్గించడానికి ఇంటికొక మనిషిని ఎసేసే సైకో… గుండె గుభేల్మనిపించే కథ
జీ 5 (Zee 5) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హ్యాక్డ్’ (Hacked). 2020లో విడుదలైన ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. కృష్ణ భట్, అమర్ ఠక్కర్, జతిన్ సేథీలు లోనరేంజర్ ప్రొడక్షన్స్‌పై దీనిని నిర్మించారు. ఇందులో హీనా ఖాన్, రోహన్ షా, మోహిత్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 2020 ఫిబ్రవరి 7న థియేటర్‌లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం జీ 5 (Zee 5) లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.